‘సత్యమేవ జయతే -2’ షూటింగ్ స్టార్ట్ .. ఈ సారి ఎవరిని టార్గెట్ చేశారో?

0

బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ‘సత్యమేవ జయతే’ చిత్రానికి సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం లక్నోలో ఈ చిత్ర షూటింగ్ను ప్రారంభించారు. జాన్ అబ్రహమ్ దివ్య కోశ్లా కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి కల్లా ఈ చిత్రం పూర్తి కావచ్చొని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. ‘సత్యమేవ జయతే పార్ట్-1 సంచలన విజయం సాధించింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని కూడా జాగ్రత్తగా చేస్తున్నాం. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని చిత్ర నిర్మాతలు తెలిపారు’

సత్యమేవజయతే సినిమాని కొంత భాగం లక్నోలో మరికొంత భాగం ముంబయిలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు మిలప్ జవేరీ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మే 12న వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. అయితే సత్యమేవ జయతే పార్ట్2 కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రముఖ సినీ విమర్శకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. పార్ట్-1లో హీరో అవినీతి పరులైన పోలీసు అధికారులను హత్య చేస్తూ ఉంటాడు. ఆద్యంతం ఆసక్తిగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు మిలప్ జవేరి.. పార్ట్2 కూడా అదే బ్యాక్డ్రాప్లో ఉంటుందో లేదో వేచి చూడాలి.