సుశాంత్ ఫ్యామిలీ లేఖలో సంచలన నిజాలు

0

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం చుట్టూ వివాదాలు ఎన్నో ముసురుకున్నాయి. ఇది ముంబైలో రాజకీయ అంశంగా మారింది. సీఎం కొడుకు హస్తం ఈ హత్యలో ఉందన్న అనుమానాలున్నాయి. ఇక బీజేపీ ఇది ముమ్మాటికీ హత్యనే అంటున్నారు.

ఈ క్రమంలోనే సుశాంత్ కు తన కుటుంబంతో సరైన సంబంధాలు లేవని తాజాగా మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పత్రిక సామ్నాలో ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ సంపాదకీయం కలకలం రేపింది.

ఈ ఆరోపణలపై తాజాగా సుశాంత్ కుటుంబ సభ్యులు ఘాటు లేఖ రాశారు. తమ కుటుంబంపై జరుగుతున్న దుష్ప్రచారంపై సుశాంత్ కుటుంబ సభ్యులు 9 పేజీల లేఖ విడుదల చేశారు. సుశాంత్ ను దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో ఖరీదైన న్యాయవాదులను నియమించుకున్నారని.. వారు న్యాయాన్ని హతమారుస్తారా అని లేఖలో సుశాంత్ కుటుంబం విస్మయం వ్యక్తం చేసింది.

సుశాంత్ పై మానసిక రోగి ముద్ర వేసి.. సంతాపం తెలిపేందుకు సమయం ఇవ్వకుండా చేశారని.. ముంబై పోలీసుల విచారణ కొద్దిమంది సంపన్నుల ఉద్దేశాలను వెల్లడించేలా సాగిందని ఆరోపించారు. తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు.