ఆర్జీవీ ఆ రీజన్ చెప్పే కోర్టుకి డుమ్మా కొట్టాడా…?

0

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కరోనా బారిన పడ్డారని.. ‘మర్డర్’ సినిమాకు సంబంధించి దాఖలైన కేసుల విచారణకు నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టుకు హాజరు కాలేకపోయారని కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో ‘మర్డర్’ కేసు విచారణను ఈ నెల 14కి కోర్టు వాయిదా వేసింది. అయితే ఆర్జీవీ తనకు కరోనా సోకిందనే వార్త ఉన్న స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ.. నాకు కరోనా వచ్చిందనే ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. ‘థ్రిల్లర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ అప్సర రాణి తో కలిసి ఇంస్టాగ్రామ్ లైవ్ కి వస్తున్నానని ట్వీట్ చేసారు.

కాగా వర్మ చెప్పినట్లే ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణితో కలిసి లైవ్ చిట్ చాట్ లో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ‘థ్రిల్లర్’ ‘డేంజరస్’ సినిమాలకు సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా వర్మ ఆరోగ్యంగా ఫిట్ గా కనిపించారు. చిట్ చాట్ లో కూడా ఎలాంటి కరోనా జాగ్రత్తలు తీసుకోకుండానే కనిపించాడు. ఇంతకముందు కూడా రామ్ గోపాల్ వర్మకు కరోనా వైరస్ సోకిందని.. జ్వరంతో బాధపడుతున్నారని వచ్చిన వార్తలను ఖండిస్తూ ఓ వీడియో వదిలారు వర్మ. చేతిలో డంబెల్ పట్టుకుని వర్కౌట్స్ చేస్తూ తాను చాలా ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నానని.. రెస్ట్ లేకుండా సినిమాలు తీస్తున్నానంటూ పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఏ కారణం చెప్పి కోర్టుకు డుమ్మా కొట్టి ఉంటారని అందరూ ఆలోచించారు. ఏదో లూప్ హోల్ వాడుకొని వర్మ కోర్టు విచారణకు హాజరు కాలేదనే అనుమానాలు వ్యక్తం చేసారు. అయితే కరోనా సోకిన వ్యక్తిని కలిస్తే కచ్చితంగా కొన్ని రోజులు కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా క్వారంటైన్ లో ఉండాలి అనే కండిషన్ ఉంది. ఈ క్రమంలో తన క్లయింట్ క్వారంటైన్ లో ఉన్నాడని వర్మ తరపు లాయర్ కోర్టుకు చెప్పి ఉంటాడని.. అది వర్మ కరోనా సోకి క్వారంటైన్ లో ఉన్నాడనే విధంగా ప్రొజెక్ట్ అయ్యుండొచ్చని అనుకుంటున్నారు.