Templates by BIGtheme NET
Home >> Cinema News >> టాలీవుడ్‌ పై ముద్దుగుమ్మకి ప్రేమ..!

టాలీవుడ్‌ పై ముద్దుగుమ్మకి ప్రేమ..!


అర్జున్‌ రెడ్డి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ షాలిని పాండే. ఈ అమ్మడు సినిమాలపై ఆసక్తి తో కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది అనేది టాక్‌. మొదటి సినిమా తోనే అర్జున్‌ రెడ్డి వంటి బోల్డ్‌ సినిమాలో నటించి తన నటన మరియు అందంతో మెప్పించిన విషయం తెల్సిందే.

తాజాగా ఈమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఆ సందర్భంగా అర్జున్‌ రెడ్డి హిందీ రీమేక్ లో ఎందుకు నటించలేదు అని ప్రశ్నించగా… తనకు ఆ ఆలోచన రాలేదు అంది. అంతే కాకుండా షాహిద్ కపూర్ మరియు కియారా అద్వానీల జోడీ కబీర్‌ సింగ్‌ లో అద్భుతంగా నటించారని కూడా షాలిని పాండే చెప్పుకొచ్చింది.

తాను ఇతర భాషల సినిమాల్లో కంటే కూడా ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తాను అంది. తనకు తెలుగు సినిమా పరిశ్రమ గుర్తింపు తెచ్చి పెట్టింది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించారు.. తప్పకుండా వారు నన్ను ముందు ముందు కూడా అభిమానిస్తారనే నమ్మకం ఉందని షాలిని పాండే పేర్కొంది. హీరోయిన్‌ గా షాలిని పాండే కి టాలీవుడ్‌ లో ప్రస్తుతం పెద్ద ఆఫర్లు ఏమీ లేవు. అయినా కూడా షాలిని పాండే తెలుగు సినిమా పరిశ్రమలో కొనసాగాలని కోరుకుంటూ ఉంది. ఆమె కు టాలీవుడ్‌ పై ఉన్న ప్రేమ ఏపాటిదో దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి టాలీవుడ్‌ ఆమె పై ప్రేమను కనబర్చి ఆఫర్లు ఇచ్చేనా చూడాలి.