శ్రీవారి దివ్య దర్శనంలో శర్వా-రష్మిక

0

యంగ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక శర్వా నటిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ఈ మూవీలో రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. కరోనా మహమ్మారీ వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. అయితే ఈ గ్యాప్ లో శర్వా రష్మిక జంట మేకోవర్ తెలిసినదే.

ఇక ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆదివారం ఉదయం వీఐపీ దర్శనం సమయంలో హీరో శర్వానంద్- హీరోయిన్ రష్మిక మందన స్వామి వారిని దర్శించుకుని అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

శర్వానంద్ సహా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ …. నిడదవోలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసుల నాయుడు… తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్… గొట్టిపాటి రవికుమార్… శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మిలింద్ నవదేకర్ వేరు వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న ఫోటోలు రివీలయ్యాయి. వీవీఐపీ కేటగిరీలో వీరంతా స్వామివారిని దర్శనం చేసుకున్నారు.