Templates by BIGtheme NET
Home >> Cinema News >> శర్వా డిజిటల్ ప్రయాణంకు ‘శ్రీకారం’?

శర్వా డిజిటల్ ప్రయాణంకు ‘శ్రీకారం’?


శర్వానంద్.. ప్రియాంక అరుల్ మోహన్ జంటగా కిషోర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట గోపీ ఆచంటలు నిర్మిస్తున్న మూవీ ‘శ్రీకారం’. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ సినిమా పోయిన సమ్మర్ లోనే విడుదల అయ్యేది. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా ఆగిపోయింది. షూటింగ్ వర్క్ కూడా బ్యాలన్స్ ఉన్న ఈ సినిమాను ప్రస్తుతం పూర్తి చేసే పనిలో పడ్డారు. వచ్చే నెల వరకు సినిమా మొదటి కాపీ రెడీ అయ్యే అవకాశం ఉందని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా విడుదలకు సంబంధించిన విషయమై గత రెండు మూడు రోజులుగా తెగ ప్రచారం జరుగుతోంది.

థియేటర్లు అన్ లాక్ అవ్వడానికి సమయం పట్టేలా ఉంది. ఒకవేళ అన్ లాక్ అయినా మళ్లీ జనాలు మునుపటి మాదిరిగా వస్తారనే నమ్మకం లేదు. కనుక రెడీ అయిన మీడియం బడ్జెట్ సినిమాలను విడుదల చేయడం మంచిది అనే నిర్ణయానికి వచ్చారు. ‘వి’ తో ప్రారంభం అయిన ఈ ఓటీటీ విడుదల టాలీవుడ్ లో కంటిన్యూ అవుతోంది. త్వరలో అనుష్క ‘నిశబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా తర్వాత ఇంకా పలు సినిమాలు కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో శర్వా ‘శ్రీకారం’ సినిమా కూడా ఓటీటీ ద్వారా విడుదల అయ్యే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఓటీటీ ప్లాట్ ఫామ్ ల నుండి కూడా క్రేజీ ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలు ఆలోచనలో పడ్డారనే వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు ఆర్థిక భారం మోయలేక చాలా వరకు ఓటీటీ రిలీజ్ కు వెళ్తున్నారు. కాని శ్రీకారం మూవీకి ఆ సమస్య లేదు. కాని ఓటీటీ డీల్ అన్ని విధాలుగా బాగుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారు అనేది మీడియా వర్గాల టాక్. హీరో శర్వా మరియు దర్శకుడు కిషోర్ ల నిర్ణయంను బట్టి శ్రీకారం ఓటీటీ రిలీజ్ ఆధారపడి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో థియటర్లకు అన్ లాక్ ప్రకటించే అవకాశం ఉన్నందున ఓటీటీకి వెళ్లే అవకాశాలు తక్కువ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకారం యూనిట్ సభ్యుల నిర్ణయం ఏంటీ అనేది చూడాలి.