Templates by BIGtheme NET
Home >> Cinema News >> Shashank Movie Poster gets Negitive feedback

Shashank Movie Poster gets Negitive feedback


బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం చుట్టూ ఉన్న చిక్కుముడులు ఇంకా వీడడం లేదు. ఆయన మరణంతో బాలీవుడ్ లోని నెపోటిజం బయటపడింది. పలువురు అగ్రదర్శక నిర్మాతలు బయట నుంచి వచ్చిన వారిని తొక్కేస్తున్నారని.. స్టార్ల వారసులకే పట్టం కడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలో ఈ వివాదం సద్దుమణగకముందే బాలీవుడ్ లో సుశాంత్ జీవిత కథ ఆధారంగా ‘శశాంక్’ సినిమాను మొదలుపెట్టారు. ప్రముఖ సీనియర్ హీరో రాజ్ బబ్బర్ కుమారుడు ఆర్యా బబ్బర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. పెద్ద వివాదానికి దారితీసింది. ఉరితాడు మధ్యలో ఆర్యాబబ్బర్ ఉండడంతో అందరూ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోస్టర్ తప్పుడు సంకేతాలు చూపిస్తోందని సుశాంత్ కుటుంబ సభ్యులు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలని వారంతా కోరుతున్నారు.

ఇక ఈ సినిమాను సుశాంత్ అభిమానులంతా బహిష్కరించాలని అప్పుడే క్యాంపెయిన్ కూడా మొదలైంది. ఈ మేరకు ట్విట్టర్ లో వారి ప్రచారానికి సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ మద్దతు పలికారు. దీంతో చిత్రం మొదలు కావడంతో పెద్ద వివాదానికి దారితీస్తోంది.