మహమ్మారీకి భయపడక థియేటర్ కి వెళ్లిన ఫ్యాషనిస్టా

0

కరోనా వైరస్ కారణంగా వరల్డ్ వైడ్గా వినోద పరిశ్రమ షట్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ స్వైర విహారం చేయడం మొదలైన తరువాత వరల్డ్ మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. దాదాపు ప్రపంచం మొత్తంగా వున్న థియేటర్లన్నీ మూతపడిపోయాయి. ఆరు నెలల విరామం తరువాత థియేటర్లు రీఓపెన్ కావడం మొదలైంది. కానీ ఇండియాలో మాత్రం అదే పరిస్థితి కొనసాగుతోంది. లండన్ లో మాత్రం థియేటర్లు రీఓపెన్ అయ్యాయి.

తొలిగా ఆస్కార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం వహించిన టెనెట్ రిలీజ్ కావడంతో ఈ మూవీని థియేటర్లలో చూసేందుకు జనం ఆసక్తిని కనబరిచారు. ప్రస్తుతం ఊహించని విధంగా ఆ స్టార్ కపుల్ లండన్ థియేటర్ లో సందడి చేయడం చర్చకొచ్చింది. సోనమ్ కపూర్- ఆనంద్ ఆహుజా `టెన్నెట్` చిత్ర ప్రీమియర్ షోకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలని సోనమ్ కపూర్ సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. మొత్తానికి థియేటర్లో సినిమా చూశాను. థీయేటర్ బిగ్ స్క్రీన్ లో సినిమా చూడాలనుకున్నాను. ఆ ఎక్స్ పీరియన్స్ అద్భుతంగా వుంది. ఓ సినిమాని థియేటరలో చూసే అనుభూతే వేరు అని తెలిపింది సోనమ్. డింపుల్ కపాడియా నటన రోమాంచితంగా వుందని… బిగ్ స్క్రీన్ మ్యాజిక్ ని.. ఆ అనుభూతిని మరోదానితో పోల్చలేం` అని తన అనుభూతిని వ్యక్తం చేసింది సోనమ్.

సోనమ్ తో పాటు ఈ చిత్రాన్ని చూసిన అనిల్ కపూర్.. అయేషా ష్రాఫ్ కూడా ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని అనుభూతిని వ్యక్తం చేశారు. 70 ఎం ఎం స్క్రీన్ పై సినిమా చూడటం ఆ అనుభూతే వేరుని చెప్పారు. సోనమ్ కపూర్ `జోయా ఫ్యాక్టర్`.. వీరే ది వెడ్డింగ్ చిత్రాల్లో నటించింది. కరోనా కారణంగా సోనమ్ ఇంత వరకు మరో సినిమాలో నటించలేదు. వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ క్రిష్టఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ వెటరన్ బ్యూటీ డింపుల్ కపాడియా.. జాన్ డేవిడ్ వాషింగ్టన్.. రాబర్ట్ పాటిన్సన్.. ఆలిజబెత్ డెబికీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కాబోతోంది.