ప్రముఖ నటుడిపై హీరోయిన్ ఆరోపణలు

0

బాలీవుడ్ కొత్త కామెడీ షో ‘గ్యాంగ్స్ ఆఫ్ ఫిల్మిస్థాన్’ ఇంకా టెలికాస్ట్ కాకముందే వివాదాల్లో చిక్కుకుంది. నటి శిల్పా షిండే ఈ షో నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. షో టెలికాస్ట్ కాకముందే షో నుంచి తప్పుకొని శిల్పా షిండే దుమారం రేపాయి.

ఇక తాను షో నుంచి తప్పుకోవడానికి నటుడు సునీల్ గ్రోవర్ కారణమని శిల్పాషిండే ఆరోపించారు. ఈ షో ప్రమోషన్ లో ఆయన మాత్రమే కనిపిస్తున్నారని.. సునీల్ నే చూపిస్తున్నారని.. మాకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదని.. శిల్పా షిండే ఆరోపించారు. అందుకే తాను వైదొలిగినట్టు వివరించారు.

ఇక కపిల్ శర్మ కామెడీ షోలో అందరికీ ప్రాధాన్యం ఉంటుందని.. అందరికీ సమాన అవకాశం లభిస్తుందని.. కానీ ఈ కొత్త కామెడీ షోలో సునీల్ గ్రోవర్ నే చూపిస్తున్నారని ప్రశ్నలు కురిపించారు. తాను అందరికోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నానని శిల్పా షిండే తెలిపారు.