శివ శివా నిన్ను ఇలా చూస్తే పూరీ ఏమైపోతాడో?

0

పోకిరి చిత్రంతో మాఫియా ముఠాలో రౌడీ రాణిలా ఆకట్టుకుంది. మహేష్ ని వేడి వేడి చూపులతో చూస్తూ అదిరిపోయే క్రష్ ని చూపించిన ఈ అమ్మడిని ఫ్యాన్స్ ఏమాత్రం అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఆడ రౌడీ అదిరిందిలే అంటూ కితాబిచ్చేశారు అప్పట్లోనే.

ఇక శివ రాణా గట్స్ కి ప్రత్యేకించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఇటీవల ఏమైందో కానీ శివ రాణాకి అవకాశాలు తగ్గినట్టే కనిపిస్తోంది. ఆ క్రమంలోనే పోటీప్రపంచంతో పోటీపడుతూ వరుస ఫోటోషూట్లతో దుమారం రేపుతోంది. రకరకాల వేడెక్కించే భంగిమలతో నిన్నటివరకూ ఇన్ స్టా ని ఫోటోషూట్లతో నింపేసిన ఈ భామ ఈసారి అందుకు భిన్నమైన ఫోటోషూట్ తో హీటెక్కించింది.

కాస్త ట్రెడిషనల్ గా ఎంతో బుద్ధిగా కనిపిస్తోంది ఈ ఫోటోగ్రాఫ్ లో. రెడ్ టాప్ .. బ్లూ రాజస్థానీ లెహంగా తరహాలో అదిరిపోయే లుక్ తో కట్టి పడేస్తోంది. ఒక రకంగా దసరా మూడ్ లోకి వచ్చేసినట్టుంది శివా రాణా. నీమీద నాకు ఫుల్ క్రష్ ఉంది శివా అంటూ ఎవరో కొంటె అభిమాని తెగ ఇదైపోయాడు.కొందరైతే జార్జియస్ బ్యూటిఫుల్ అంటూ తెగ పొగిడేశారు. శివా రాణా ప్రయత్నం చూసి కనీసం ఫైటర్ లో అయినా పూరి అవకాశం ఇవ్వకపోతాడంటారా?