సుశాంత్ మధుర జ్ఞాపకాలను షేర్ చేసిన శ్రద్ధాకపూర్…!

0

దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ – శ్రద్ధాకపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిందీ సినిమా ”చిచోరే”. నవీన్ పొలిశెట్టి – వరుణ్ శర్మ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. నితేష్ తివారీ దర్శకత్వం వహించారు. న్యూ ఏజ్ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై నేటితో (సెప్టెంబర్ 6) ఏడాది పూర్తి అయింది. ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ సినిమా జ్ఞాపకాలను చిత్ర యూనిట్ నెమరు వేసుకుంది. షూటింగ్ సమయంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ని మరపురాని జ్ఞాపకాలని ‘చిచోరే’ టీమ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఈ సందర్భంగా శ్రద్ధాకపూర్ మధుర జ్ఞాపకాలకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఇన్ లవింగ్ మెమొరీ.. వన్ ఇయర్ ఆఫ్ చిచోరే’ అని శ్రద్ధా క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియోలో ‘చిచోరే’ షూటింగ్ స్పాట్ లో మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుతూ కనిపిస్తున్న సుశాంత్ టీమ్ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇక చిత్ర దర్శకుడు నితేష్ తివారీ.. ‘నువ్వు మా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతావు.. వి మిస్ యూ సుష్’ అంటూ పోస్ట్ చేశారు. అభిమానులు ఈ వీడియోకి కామెంట్స్ పెడుతూ సుశాంత్ ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.