పార్టీకి వెళ్ళాను.. కానీ డ్రగ్స్ తీసుకోలేదు!

0

బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఇటీవల మరణించిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఫార్మ్ హౌస్ లో నిర్వహించే డ్రగ్ పార్టీలో శ్రద్ధా కపూర్ కూడా పాల్గొన్నారనే అభియోగాలతో ఆమెకు ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేసారు. టాలెంట్ మేనేజర్ జహ సాహా చాటింగ్ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11.47 గంటలకి శ్రద్ధా విచారణ కొరకు ఎన్సీబీ ఆఫీస్ కు చేరుకున్నారు. రెండు గంటలకు పైగా కొనసాగుతున్న విచారణలో శ్రద్ధా.. పలు కీలక సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో శ్రద్ధా కపూర్ సుశాంత్ నిర్వహించిన పార్టీకి వెళ్లినట్లు అంగీకరించిందని.. ఆ పార్టీలో 6 నుంచి 7 మంది ఉన్నారని.. అక్కడ డ్రింక్స్ మాత్రమే తీసుకున్నారని.. ఎన్సీబీ విచారణలో చెప్పిందని ‘టైమ్స్ నౌ’ ఛానల్ పేర్కొంది. అంతేకాకుండా అక్కడ డ్రగ్స్ తీసుకోలేదని.. ఆ పార్టీ నుండి అందరికంటే ముందే వెళ్లిపోయానని శ్రద్ధా స్టేట్మెంట్ ఇచ్చినట్లు ‘టైమ్స్ నౌ’ వెల్లడించింది. ఇక ఈ కేసులో విచారణకు హాజరైన దీపికా పదుకునే నాలుగున్నర గంటల విచారణ అనంతరం ఎన్సీబీ ఆఫీస్ నుండి ఇంటికి బయల్దేరారు. ఈ విచారంలో తన మేనేజర్ కరిష్మా ప్రకాష్ తో 2017 అక్టోబర్ లో డ్రగ్స్ చాట్ చేసినట్లు దీపికా అంగీకరించిందని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది.