శ్రుతి ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోవడానికి అదే కారణం

0

కార్పొరెట్ కంపెనీల్లో ఎన్నో భరించి ఉద్యోగాలు వదిలేసిన ఆడాళ్లున్నారు. అలాంటిది సినీరంగం వరకే వేలెత్తి చూపిస్తారేమిటి? అంటూ నిలదీస్తున్నారు శ్రుతిహాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీపరిశ్రమలో అడుగు పెట్టినా తాను కూడా ఎన్నో ఎదుర్కొన్నానని బహిరంగంగా వెల్లడించి షాకిచ్చారు.

ప్రతిదానికి చిత్రపరిశ్రమనే లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు. ఇది సరైన ధోరణి కాదని ఖండించారు శ్రుతి. అన్ని రంగాల్లోనూ వేధింపులు కుట్రలు ఉంటాయని అన్నారు. స్వీయానుభవంలో అలాంటివి చూశానని అన్నారు. పైగా ముక్కుసూటిగా ఉండే తాను ఇలాంటి వాటితో ఎన్నో అవకాశాల్ని కోల్పోవాల్సి వచ్చిందని శ్రుతి తెలిపింది. ప్రతి రంగంలో మంచి చెడు ఉంటాయి. కేవలం సినీపరిశ్రమకే చెడును ఆపాదించడం సరికాదని క్లాస్ తీస్కుంది శ్రుతి.

ఎదుట ఉన్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా క్యారెక్టర్ నచ్చకపోతే అసలు నేను ఖాతరు చేయను అని కూడా శ్రుతి తెలిపింది. తాను ఇలా ఉండడం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయానని వెల్లడించింది. వ్యక్తిత్వం నిలబెట్టుకోవాలనుకుంటే ఇదే సమస్య. ఆడాళ్లు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని శ్రుతిహాసన్ అన్నారు.