సందట్లో సడేమియాలా బ్యాక్ లెస్ లో చెలరేగిన రాశీ!

0

అందం డెఫినిషన్ రాశీఖన్నా. ఆ అందానికి ఫిదా కాని వాళ్లున్నారా? రాశీ రెగ్యులర్ ఫోటోషూట్లతో ఇటీవల ఇన్ స్టా షేక్ అవుతోంది. తాజాగా రాశి ఖన్నా బ్యాక్ లెస్ లుక్ తో చెలరేగిపోవడం సంచలనమే అయ్యింది. రాశీ నెవ్వర్ బిఫోర్ బోల్డ్ స్టైల్ స్టేట్ మెంట్ ఇది.

లేటెస్ట్ ఫోటోషూట్ ట్రయల్స్ నుండి ఒక చిత్రాన్ని తన స్టైలిస్ట్ ఆర్చా మెహతాతో రాశీ పంచుకున్నారట. తనే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఛాయా చిత్రానికి ఒక అందమైన క్యాప్షన్ ఇస్తూ `దుస్తుల పరీక్షల అభిమానిని కాదు` అని వ్యాఖ్యను జోడించింది. రాశీ ఇటీవలే వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత వరుస ఫోటోషూట్లతో చెలరేగుతోంది.

ఇక రాశీ రెగ్యుల్ ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడి జిమ్ లుక్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. రాశి ఖన్నా హైదరాబాద్ లోని జిమ్ వెలుపల రోజూ కనిపిస్తుంది. లాక్ డౌన్ లో రాశీ మరింతగా ఆరోగ్యంపై దృష్టి సారించింది. ఆమె జిమ్ వేర్స్ లో కూడా స్టైల్ స్టేట్ మెంట్స్ ఇస్తోంది. స్టన్నర్ యాబ్స్ తో షేక్ చేస్తోంది. కెరీర్ సంగతి చూస్తే.. రాశి ఖన్నా చివరిసారిగా నటించిన సినిమా పరాజయం అందుకుంది. ప్రస్తుతం ఒక తెలుగు సినిమా వేరొక తమిళ సినిమా చేస్తూ బిజీగా ఉంది.