అభిమానులంటే బాలుకు ఇంత అభిమానం

0

ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి చెందిన తర్వాత ఆయనకు ఉన్న అభిమానగణం గురించి ప్రపంచానికి తెల్సిందే. ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లతో అంతర్జాతీయ మీడియాలో సైతం బాలు గురించి కథనం వచ్చింది అంటే ఏ స్థాయిలో ఆయనకు అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆయన స్థాయి అంతర్జాతీయ స్థాయి అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన అభిమానులను ఆయన కూడా ఎంతగానో అభిమానిస్తారు. తన అభిమానుల కోసం తన వారి కోసం కష్టం అయినా నష్టం అయినా పాటలు పాడుతూ వచ్చారు. ఎన్నో సార్లు కేవలం అభిమానుల కోసమే స్టేజ్ షో లో ఆయన పాల్గొన్నారు. తనను అభిమానించే ఒక అభిమానిని శ్రీలంక వెళ్లి మరీ సర్ ప్రైజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రీలంకకు చెందిన బాలు అభిమాని ప్రమాదంలో రెండు కళ్లు పోగొట్టుకున్నారు. ఆ తమిళ అభిమానికి బాలు గారు అన్నా ఆయన పాటలు అన్నా కూడా విపరీతమైన అభిమానం. ఆ అభిమానంను తెలుసుకున్న బాలు గారు ఆయన్ను సర్ ప్రైజ్ చేసేందుకు వెళ్లారు. ఆయన పాట పాడుతూ ఉండగా బాలు గారు వెనుక నుండి పాట అందుకున్నారు. పాట పాడుతూ బాలు గారు అంటే నాకు ఇష్టం అంటూ నా పేరు బాల సుబ్రమణ్యం.. ఎస్పీ బాలసుబ్రమణ్యం అంటూ చెప్పి ఆ అభిమానిని ఆశ్చర్య పర్చాడు. వెంటనే కూర్చుని ఉన్న ఆ అభిమాని నిల్చుని బాలు గారిని ఆప్యాయంగా తడిమారు. ఇది జరిగి చాలా కాలం అయ్యింది. అయితే ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. బాలు గారు తన అభిమానులను ఇంతగా అభిమానిస్తారా అంటూ ఆశ్చర్యం వేయక మానదు.

That time he met a fan from Eelam who lost his eyesight in an explosion. #RIPSPB pic.twitter.com/R4H2ROp5hw

— சுந்தர் / sunthar /