21 రోజులు కష్టపడ్డ తమన్నా

0

కరోనా ఏ ఒక్కరిని వదిలి పెట్టదని ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అందులో భాగంగా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడంతో పాటు చాలా ఫిట్ గా ఉండేందుకు వర్కౌట్స్ చేయడం చేస్తున్నారు. సెలబ్రెటీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా స్టే ఫిట్ ఛాలెంజ్ పేరుతో తన స్నేహితులు ఇచ్చిన ఛాలెంజ్ లో భాగంగా 21 రోజుల పాటు ఆరోగ్య నియమాలు మరియు ఆహార నియమాలు పాటించినట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.

ఆ 21 రోజుల పాటు తాను ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకోవడంతో పాటు రెగ్యులర్ గా యోగా మరియు వర్కౌట్స్ చేశాను. ఉదయాన్నే ఫ్రెంచ్ టోస్ట్.. పాన్ కేక్.. అరటిపళ్లు.. నట్స్ తిన్నాను. శారీరకంగా బలంగా ఉండేందుకు గంటకు పైగా వర్కౌట్స్ చేయడంతో పాటు మానసికంగా ప్రశాంతత కోసం యోగా మరియు ప్రాణాయామా చేశాను అంది. ప్రతి ఒక్కరు కనీసం ఈ ఛాలెంజ్ ను స్వీకరించి అయినా తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటూ తమన్నా పేర్కొంది. ప్రస్తుతం ఈమె సిటీమార్ మూవీతో పాటు నితిన్ తో హిందీ మూవీలో నటిస్తోంది. ఆహా కోసం ఒక టాక్ షోను కూడా ఈమె చేస్తుందట. ఇదే సమయంలో ఈమె వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తోంది.