సీరియస్ అయ్యి షూటింగ్ మద్యలో వెళ్లి పోయిన శృతి హాసన్

0

కరోనా కారణంగా దాదాపు అయిదు ఆరు నెలలు షూటింగ్ లు జరగలేదు. ఎట్టకేలకు మళ్లీ షూటింగ్ ల సందడి కొనసాగుతుంది. ఔట్ డోర్ షూటింగ్ అంటే ఖచ్చితంగా జనాలు వందల సంఖ్యలో వస్తారు. కాని ఈ సమయంలో అంత మంది జనాలు వస్తే చాలా ప్రమాదం. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలి. జనాలు రాని చోట షూటింగ్ చేసుకోవాలి. లేదంటే జనాలు రాకుండా అయినా జాగ్రత్తలు తీసుకోవాలి. కాని శృతి హాసన్.. విజయ్ సేతుపతి జంటగా తెరకెక్కుతున్న ఒక సినిమా షూటింగ్ స్పాట్ కు వందల మంది జనాలు రావడంతో గందరగోళం ఏర్పడిందట.

షూటింగ్ స్పాట్ కు వందల మంది చూసేందుకు తరలి రావడంతో హీరోయిన్ శృతి హాసన్ అక్కడ నుండి వెళ్లి పోయిందట. చిత్ర యూనిట్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా అంటూ అసహనంగా అక్కడ నుండి వెళ్లి పోయింది. షూటింగ్ మద్యలో శృతి హాసన్ వెళ్లి పోవడంతో ఒకటి రెండు షాట్ లు ఆమె లేకుండా చిత్రీకరించి ఆమె లేకపోవడంతో పేకప్ చెప్పేశారట.

షూటింగ్ నుండి అర్థాంతరంగా వెళ్లి పోవడంపై శృతి స్పందిస్తూ.. ఈ సమయంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా కీలకం. కరోనా అనేది ఇంకా పోలేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రొటోకాల్ పాటించాల్సిందే. అలా చేయకుంటే మహిళగా నా జాగ్రత్త నేను తీసుకుంటా అందుకే షూటింగ్ మద్యలో నుండి వచ్చానంటూ తన ప్రవర్థనను సమర్థించుకుంది. యూనిట్ సభ్యులు ఆమె తీరును ఇప్పటి వరకు తప్పుపట్టలేదు. తమిళ మీడియాలో ఈ విషయంపై ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి.