వైభవంగా సిరివెన్నెల కుమారుడి పెళ్లి

0

టాలీవుడ్ లో సిరివెన్నెల అంటే తెలియని వారు ఉండవు. 60 ఏళ్లు దాటినా ఆయన పాటలోని మాధుర్యం ఇప్పటికీ తరగదు. ఇంత ఏజ్ లోనూ ఇటీవల ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు అందమైన పాటలు రాశారు.

సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నుల సీతారామశాస్త్రి చిన్న కుమారుడు నటుడు రాజా భవనీ శంకర శర్మ ఓ ఇంటివాడయ్యాడు. ఆయన వివాహం శనివారం హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో అంగరంగ వైభవంగా సాగింది.

రాజా వివాహం వెంకటలక్ష్మి హిమబిందుతో శనివారం ఉదయం 10.55 నిమిషాలకు జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ కృష్ణవంశీ క్రిష్ గుణ్ణం గంగరాజు వంశీ పైడిపల్లి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ వెంకట్ అక్కినేని రచయిత సాయిమాధవ్ బుర్రా తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.