స్మాల్ స్క్రీన్ బ్యూటీస్ ని ఎంకరేజ్ చేస్తున్న స్టార్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్…!

0

తెలుగు బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లేడీ సెలబ్రిటీలు ఇప్పుడు వెండితెరపై సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే యాంకర్ అనసూయ బిగ్ స్క్రీన్ పై హవా కొనసాగిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో సుక్కు తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ మూవీలో కూడా ఓ రోల్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇక స్మాల్ స్క్రీన్ పై పలు సీరియల్స్ లో నటించి ‘బిగ్ బాస్’ రియాలిటీ షో తో బాగా పాపులర్ అయిన హరితేజ కూడా బిగ్ స్క్రీన్ పై అడుగుపెట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ”అ ఆ” సినిమాతో పేరు తెచ్చుకున్న హరితేజ ప్రస్తుతం సినిమాల్లో మంచి అవకాశాలే దక్కించుకుంటోంది.

ఈ క్రమంలో యాంకర్ రష్మీ గౌతమ్ కూడా వెండితెరపై సత్తా చాటాలని చూస్తోంది. అందాలు ఆరబోస్తూ యాంకరింగ్ చేసి కొత్త ఒరవడిని సృష్టించిన రష్మీ.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ ఏర్పరచుకుంది. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అప్ కమింగ్ మూవీలో రష్మీ గౌతమ్ కి ఓ రోల్ ఆఫర్ చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అయితే అది ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తున్న ‘ఆచార్య’ సినిమాలో మాత్రం కాదని తెలుస్తోంది. ‘గుంటూరు టాకీస్’ సినిమాలో బోల్డ్ గా నటించిన రష్మీని కొరటాల శివ – అల్లు అర్జున్ కాంబోలో రానున్న మూవీలో తీసుకుంటారని సమాచారం.

కాగా స్మాల్ స్క్రీన్ మీద క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ అందరూ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై నిరూపించుకోడానికి ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ – సుకుమార్ – కొరటాల శివ వంటి అగ్ర దర్శకులు కూడా వీరిని ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేకాకుండా స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ తో మంచి రిలేషన్ మైంటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అనసూయకి మైత్రీ మూవీ మేకర్స్.. హరితేజ కు హారికా అండ్ హాసిని క్రియేషన్స్.. అలానే రష్మీకి గీతా ఆర్ట్స్ సపోర్ట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.