Templates by BIGtheme NET
Home >> Cinema News >> వర్కౌట్ అవ్వని అభిజిత్ ప్లాన్.. కెప్టెన్ అయిన సోహెల్

వర్కౌట్ అవ్వని అభిజిత్ ప్లాన్.. కెప్టెన్ అయిన సోహెల్


బిగ్ బాస్ ఈ వారం ఇచ్చిన టాస్క్ బిబి హోటల్ సాదా సీదాగా సాగిపోయింది. పెద్దగా వివాదం లేకుండా ఎవరికి వారు అన్నట్లుగా గేమ్ ఆడారు. గెస్ట్ ల టీం ఇవ్వాల్సిన స్టార్ లను హోటల్ మేనేజర్ అయిన అభిజిత్ కొట్టేయడం వాటిని అ తర్వాత హారిక చేతుల మీదుగా మళ్లీ వాటిని తీసుకుని గెస్ట్ లు ఆ స్టార్స్ ఇచ్చారంటూ అభిజిత్ ప్రకటించడం జరిగింది. టాస్క్ లో భాగంగా హోటల్ వారు ఇచ్చిన ఏ ఒక్క సర్వీసు నచ్చని కారణంగా ఒక్క స్టార్ కంటే ఎక్కువ ఇవ్వలేదని ధనికుల టీం చెప్పింది.

టాస్క్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ హోటల్ సిబ్బందిని మీకు ధనికుల టీం ఎన్ని పాయింట్స్ ఇచ్చింది అంటూ ప్రశ్నించగా అయిదు స్టార్స్ అంటూ అభిజిత్ పేర్కొన్నాడు. ఆ సమయంలో ధనికుల టీం మేము మాత్రం ఆ స్టార్స్ ఇవ్వలేదు ఒకే ఒక్క స్టార్ మాత్రమే ఇచ్చాం బిగ్ బాస్ అంటూ చెప్పారు. కొద్ది సమయం చర్చ తర్వాత ఇంటి సభ్యులు కేవలం ఒక్క స్టార్ మాత్రమే ఇచ్చినట్లుగా పేర్కొంటూ ధనికుల టీం గెలిచినట్లుగా పేర్కొన్నారు.

గెలుపొందిన ధనికుల టీం నుండి ఒక ఉత్తమ ప్రదర్శణ కనబర్చిన వారిని ఎంపిక చేయాలంటూ బిగ్ బాస్ చెప్పగా ఇంటి సభ్యులు ఎవరికి వారు తామే బెస్ట్ అనుకుంటున్నట్లుగా చెప్పారు. ఆ తర్వాత సోహెల్ మరియు మెహబూబ్ ల మద్య చర్చ జరిగింది. కాయిన్ టాస్క్ లో నీకు నేను సాయం చేశాను కనుక ఈసారి నువ్వు నాకు మద్దతుగా నిలవాల్సిందే అంటూ సోహెల్ డిమాండ్ తో మెహబూబ్ కన్విన్స్ అవ్వలేదు. ఇద్దరి మద్య చాలా సమయం చర్చ జరిగింది. చివరకు మీ ఇద్దరితో పాటు నేను కూడా పోటీలో ఉంటాను అంటూ అరియానా రావడంతో ఆమెకు చోటు కల్పించడం ఎందుకు అనుకున్న మెహబూబ్ సరే అంటూ సోహెల్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేస్తున్నట్లుగా ప్రకటించారు. దాంతో సోహెల్ ను మొదటి కెప్టెన్సీ పోటీదారుగా ప్రకటించారు.

హోటల్ సిబ్బంది టీం లో అఖిల్ ఎక్కువ టిప్పు పొందిన కారణంగా అతడిని రెండవ కెప్టెన్సీ పోటీదారుగా బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక సీక్రెట్ టాస్క్ ను విజయవంతంగా నిర్వహించిన అవినాష్ ను మూడవ కెప్టెన్ పోటీ దారుగా ప్రకటించారు. వీరి ముగ్గరురికి మంచు నిప్పు టాస్క్ ను ఇవ్వడం జరిగింది. వెనకాల నిప్పుల కుంపటి వంగి చేతిలో ఐస్ బౌల్స్ పట్టుకోవాల్సి ఉటుంది. ఎక్కువ సేపు ఎవరు నిల్చుంటే వారు విన్నర్స్. అఖిల్ మొదట తప్పుకోగా.. అవినాష్ ఇంకా సోహెల్ లు చాలా సమయం ఉన్నారు. అవినాష్ ఇక తన వల్ల కాదంటూ తప్పుకోవడంతో సోహెల్ విజేతగా నిలిచాడు. కెప్టెన్ గా సోహెల్ ఎంపిక అయ్యాడంటూ సంజాలక్ అభిజిత్ ప్రకటించి కెప్టెన్ బ్యాండ్ పెట్టాడు.