సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఇందులో తేజ్ కి జోడీగా నభా నటేష్ నటించింది. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మరియు సాంగ్స్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. విరాట్ ఫిలాసఫీ పేరుతో రిలీజ్ చేసిన గ్లిమ్స్ కూడా ఆకట్టుకుంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. లాక్ డౌన్ తరవాత థియేటర్లలో విడుదలవుతోన్న ఒక స్టార్ హీరో సినిమా ఇదేనని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ ట్రైలర్ స్టార్టింగ్ లో ‘మాకు న్యాయం జరగాలి’ అంటూ కొంత మంది యువతీ యువకులు ధర్నా చేస్తూ సాయి ధరమ్ తేజ్ కటౌట్ ని తగలబెడుతున్నారు. ‘అసలు వీడెవడు? ఏమి చేసుంటాడు? ఖర్చు పెట్టి మరీ వీడి కటౌట్ ను ఎందుకు తగలబెడుతున్నారు? ఇదంతా తెలియాలంటే మీరు ఈ కథలోకి రావాలి’ అంటూ విరాట్ పాత్రధారి అయిన సాయి తేజ్ చెప్తున్నాడు. ‘మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛగా బ్రతకమని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. వాటిని మనం ఈ ప్రేమ పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్ షిప్స్ తో నాశనం చేస్తున్నాం’ అని తేజ్ చెప్పడం ద్వారా ఈ సినిమా నేపథ్యం అర్థం అవుతోంది. ‘సినిమా హాళ్ళలో మందుకి సిగరెట్లకి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చినట్లే.. అలానే పెళ్లి కి పెళ్ళానికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలి’ అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ హాస్యాస్పదంగా ఉంది.
సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సింగిల్ గా ఉండాలని డిసైడైన విరాట్ లైఫ్ లోకి అమృత అనే అమ్మాయి వచ్చిన తర్వాత జరిగే పరిస్థితులను ఇందులో చూపించారు. బ్యాచిలర్ గా ఉండటానికి విరాట్ చేసే ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఆర్.నారాయణమూర్తి ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సోలోగా ఉండాలని నిర్ణయించుకున్న విరాట్.. ‘మనిషి ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పెళ్లి చేసుకోవాలి’ అని ఓ ఇంటర్వ్యూలో ఆర్. నారాయణమూర్తి చెప్పడం చూసి షాక్ తినడంతో ట్రైలర్ పూర్తయింది. ఇందులో రాజేంద్రప్రసాద్ – సీనియర్ నరేష్ – రావు రమేష్ – వెన్నెల కిషోర్ – సత్య కీలక పాత్రలు పోషించారు. దీనికి వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. థమన్ సంగీతం సమకూర్చాడు. మొత్తం మీద సోలో లైఫ్ సో బెటర్ అంటూ వచ్చిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ వారు ఈ నెల 25న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=CtRvAZSQH5I
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
