‘ఆదిపురుష్’ లీడ్ లేడీ విషయంలో ఒక క్లారిటీ మరో పుకారు

0

Some Clarity about  Adipurush  lead lady

Some Clarity about Adipurush lead lady

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ‘ఆదిపురుష్’ అనే చిత్రం రూపొందబోతున్న విషయం తెల్సిందే. హిందీ మరియు తెలుగు భాషల్లో ఒకేసారి వేరు వేరు నటీనటులతో రూపొందబోతున్న ఈ చిత్రం హీరోయిన్ విషయమై గత రెండు మూడు రోజులుగా తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. మహానటి ఫేం కీర్తి సురేష్ ను సీత పాత్రకు గాను ప్రభాస్ కు జోడీగా ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రభాస్ రాముడిగా కీర్తి సురేష్ సీతగా కనిపించనున్నట్లుగా సౌత్ ఇండియన్ మీడియాలో ప్రముఖంగా కథనాలు వచ్చాయి. దాంతో కీర్తి సురేష్ ఆ విషయమై క్లారిటీ ఇచ్చింది.

ఆదిపురుష్ చిత్రంలో తాను పార్ట్ ను కావడం లేదని ఆ సినిమా కోసం తనను ఎవరు కూడా సంప్రదించలేదని మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది. దాంతో ఆది పురుష్ కు కీర్తి సురేష్ కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ వచ్చేసింది. ఈ సమయంలోనే మరో పుకారు షికారు చేస్తోంది. సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కు కూడా బాగా నచ్చిన ముద్దుగుమ్మ కియారా అద్వానీని సీత పాత్ర కోసం తీసుకునే యోచనలో ఉన్నారట.

తెలుగులో భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన ఈమె ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయ్యింది. ముఖ్యంగా కబీర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా ఈమె స్టార్ డం పెరిగి పోయింది. ఆ కారణంగానే ఈమెను ఆదిపురుష్ చిత్రంలో సీత పాత్రకు తీసుకుంటే బాగుంటుందనే నిర్ణయంలో మేకర్స్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాదిలో సినిమాను పట్టాలెక్కించనున్నారు. అంటే ఇంకా చాలా సమయం ఉంది. కనుక హీరోయిన్ విషయంలో ఇప్పట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం లేదు అంటున్నారు. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబో మూవీలో దీపిక పదుకునే హీరోయిన్ గా నటించబోతున్న విషయం తెల్సిందే. ఆదిపురుష్ కోసం కూడా బాలీవుడ్ హీరోయిన్ తోనే ప్రభాస్ నటించబోతున్నాడు అంటున్నారు. త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.