నా బాడీ.. నా క్లీవేజ్` సింగర్ వ్యాఖ్య.. ప్రచారం పిచ్చా?

0

అవును.. ఆ హాట్ సింగర్ లేటెస్ట్ కామెంట్స్ అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. `నా బాడీ.. నా క్లీవేజ్` నా ఇష్టం అనేయడంతో అది కాస్తా యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా ఫికర్ చివరికి అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇంతకీ ఎవరా సింగర్ అంటే.. పేరు సోనా మోహపాత్రా.

మీటూ వేధింపులు అనే టాపిక్ ని ప్రస్థావిస్తూ .. తన కాలేజ్ డేస్ లో ఎదురైన అనుభవాన్ని ఇప్పుడు గాయని సోనా గుర్తు చేసుకున్నారు. తాను బీటెక్ ఇంజినీరింగ్ చేసేప్పుడు వదులుగా ఉండే ఖాదీ ఆకుపచ్చ సల్వార్-కుర్తాలో మైక్రోప్రాసెసర్ ల్యాబ్ కు నడుచుకుంటూ వెళుతుంటే
తన సీనియర్లు ఈలలు వేస్తూ కామెంట్ చేశారట. ` బ్రా సైజు గురించి బిగ్గరగా ఊహాగానాలు చేస్తూ కామెంట్లు చేశారు. నా బి * లను పూర్తిగా కవర్ చేయాలనే అలా“ అని ఆమె ట్వీట్ చేసింది. సోనా తన ట్వీట్ లో #ఐ నెవ్వర్ ఆస్క్ ఫర్ ఇట్ అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించారు.

బాధితులపై లైంగిక వేధింపుల నుండి బయటపడిన వారికి ఎదురైన ప్రశ్నల్లో ఆ వేధింపుల సమయంలో వారు ఎలాంటి దుస్తులు ధరించారో అడిగేవారని కూడా ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు ఎలాంటి దుస్తులు ధరించినప్పుడు అలాంటిది ఎదురైందో పరీక్షించుకోవాలని కూడా ప్రత్యేక ట్వీట్ లో గాయని మోనా కోరారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్… గాయని చిన్మయి శ్రీపాద.. మరికొందరిని ఆమె ట్వీట్ లో ట్యాగ్ చేశారు.

సోనా ట్వీట్పై స్పందిస్తూ.. నెటిజనుల్లో ఒక విభాగం ..ప్రచారం కోసం ఆకలితో ఉన్నందున ఆమె ఇలాంటివి రాసిందని ట్రోల్ చేశారు. కొందరు అయితే మోనా చెప్పినదానితో ఏకీభవించి వారి అభిప్రాయాలను అనుభవాలను పంచుకున్నారు.

సీనియర్లు.. మేల్ క్లాస్ మేట్స్ మీ అందాల పరిమాణం గురించి అంతులేని రాత్రుల్లో మాట్లాడుకున్నారు. కొంతమంది అమ్మాయిలు దృష్టిని ఆకర్షిస్తారు. కొందరు ఎప్పుడూ నన్ను ఇష్టపడతారు ఎందుకనో? #INeverAskForIt అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు.

కాలేజీ క్యాంపస్లు చాలా చెత్తగా ఉన్నాయి. వాటికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉండాలి. లేదా పాఠశాలల్లో యుక్తవయస్సును ఎలా ఉండాలో అనే దానిపై సెక్స్-ఎడ్ క్లాసులు ఉండాలి అని మరొక వినియోగదారు సూచించారు.

హాట్ క్లీవేజ్ ని చూపించే వైనంపై వ్యాఖ్యానించిన ఒక వినియోగదారుపై స్పందిస్తూ.. సోనా ఇలా సమాధానమిచ్చారు.. కస్ ఇట్స్ .. నా బాడీ.. నా క్లీవేజ్ మిస్టర్ జే… నేను ఇష్టపడే విధంగా చేస్తాను అని వ్యాఖ్యానించారు.

Cus it’s my body my cleavage Mr. Jay whoever. I do as I please with it.