హైకోర్టు మెట్లు ఎక్కిన కంగనా సిస్టర్ … కారణాలివే !

0

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ కి ముంబై పోలీసులు మూడు సార్లు సమన్లు జారీచేసినా కూడా ఆమె ఆమె సోదరి మాకు కాదు అన్నట్టుగా ఏమి పట్టనట్టు ఉన్నారు. అయితే విచారణకి హాజరు కాలేదనే నెపంతో పోలీసులు అరెస్ట్ చేస్తారని కంగనా రనౌత్ ఆమె సోదరి రంగోళి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. ముంబాయి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ను రద్దు చెయ్యాలని కంగనా సిస్టర్స్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే సినిమా షూటింగ్ లుకు వెళ్లడానికి మీ వద్ద సమయం ఉంటుంది మా ముందు హాజరుకావడానికి మీకు సమయం లేదా అంటూ పోలీసులు వారిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముంబాయికి చెందిన ప్రముఖ న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ కంగనా రనౌత్ ఆమె సోదరి రంగోళిపై గత నెలలో ముంబాయిలో కేసు పెట్టారు. వారిద్దరూ మతపరమైన ఆరోపణలు చేస్తున్నారని మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా నటి కంగనా రనౌత్ ఆమె సోదరి రంగోళి ప్రజలను రెచ్చగొడుతున్నారని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. వారి పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టులో మనవి చేశారు.

ఇదే సందర్భంలో రంగోళి ఈ మధ్య చేసిన ట్విట్ లను న్యాయవాది కోర్టు ముందు సమర్పించారు. ముంబాయి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా కంగనా రనౌత్ ఆమె సోదరి రంగోళి మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ కోర్టులో ఫిర్యాదు చేశారు. నాకు సినీ పరిశ్రమలో పెద్ద వ్యక్తులతో పరిచయం ఉందని ఆ కారణంగా రాజకీయ నాయకులతో కూడా కొంచెం మంచి సంబంధాలు ఉన్నాయని ఏమీ చేసిన చెల్లుబాటు అవుతుంది అనే ధైర్యంతో రెచ్చిపోతుందని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ ఆరోపించారు. అయన ఆరోపణలపై విచారణ చేసిన కోర్టు వారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ముంబాయి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన ముంబాయి పోలీసులు కంగనా రనౌత్ ఆమె సోదరి రంగోళిపై విచారణ చేపట్టారు. ఆ తర్వాత వారిద్దరి పై కేసు నమోదు చేసి విచారణ కి రావాలని ఇప్పటివరకు మూడు సార్లు సమన్లు జారీచేశారు. అయితే పోలీస్ విచారణకి హాజరుకాకుండా కంగానా జయలలిత బయోపిక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. దీనితో పోలీసులు కూడా ఈమె పై కొంచెం ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది. దీనితో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలతో మేము ఏ తప్పు చేయలేదని మా మీద నమోదైన ఎఫ్ ఐ ఆర్ ను రద్దు చెయ్యాలని కంగనా రనౌత్ సోదరి రంగోళి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తమ మీద విచారణ చెయ్యాలని బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చెయ్యాలని కంగనా రనౌత్ ఆమె సోదరి రంగోళి బాంబే హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.