Templates by BIGtheme NET
Home >> Cinema News >> 27 ఏళ్ల కుర్రాడు అరెస్ట్.. కేసు బుక్ చేసిన సోనాక్షి

27 ఏళ్ల కుర్రాడు అరెస్ట్.. కేసు బుక్ చేసిన సోనాక్షి


సోషల్ మీడియాల్లో ఇష్టానుసారం బూతులు మాట్లాడేస్తూ నచ్చిన భాషను ఉపయోగించేస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ చూస్తూ ఊరుకోదు. దూషణలు .. పరాచికాలకు దిగినా .. వేధింపులకు పాల్పడినా ఫిర్యాదు మేరకు వెంటనే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ తరహాలో ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అరెస్టులు చేసి జైల్లో వేశారు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పైనా బూతు పదజాలంతో వల్గర్ పోస్టులు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు ఈ 27 ఏళ్ల కుర్రాడు.

సోనాక్షిని ఇష్టానుసారం దూషిస్తూ ఇష్టానుసారం పోస్టింగులతో చెలరేగిన ఆయువకుడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందినవాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. తనపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నాడని ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు శశికాంత్ గులాబ్ జాదవ్.

అతడిపై ఐపీసీ ఐటీ యాక్ట్ కింద అతనిపై కేసులను నమోదు చేశారు. ఇలా వేధించేవారిని అస్సలు క్షమించకూడదని చెప్పిన సోనాక్షి పోలీసులను ప్రశంసించారు. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే దబంగ్ 3 ఫ్లాపవ్వడం ఈ అమ్మడిని నిరాశపరిచింది.