Templates by BIGtheme NET
Home >> Cinema News >> సోఫీ దెబ్బకు సలసలా కాగిన మాల్దీవులు

సోఫీ దెబ్బకు సలసలా కాగిన మాల్దీవులు


మాల్దీవుల్లో భామల చిలౌట్ ఫోటోలు ప్రస్తుతం గూగుల్ లో ట్రెండింగ్ గా మారిన సంగతి తెలిసిందే. మలైకా- ఎల్లీ అవ్ రామ్-పరిణీతి- కాజల్ – రకుల్ ప్రీత్ .. ఇలా భామలంతా ఒంటరి దీవుల్ని షేక్ చేశారు. కాజల్ కిచ్లు జంట.. చై – సామ్ జంట విహారానికి సంబంధించిన వేడెక్కించే ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి.

జంటలన్నీ వారాల కొద్దీ సమయం అక్కడ దీవుల్లోని రిసార్టుల్లో తిష్ఠ వేసి ఫుల్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. అండర్ వాటర్ ఫోటోషూట్లతో మంటలు పుట్టిస్తున్నారు. బికినీల్లో వీరవిహారం చేస్తుంటే రెండు కళ్లు చాలడం లేదు.

ఇప్పుడు ట్రీట్ నషాలానికి ఎక్కించేస్తూ మరో అమ్మడు పింక్ బికినీలో మాల్దీవుల్ని షేక్ చేస్తున్న ఫోటోలు అంతర్జాలంలో రివీలయ్యాయి. ఇంతకీ ఎవరీ అమ్మడు అంటే యోగా కోచ్ కం యాంకర్ కం నటి సోఫీ చౌదరి. ఈ అమ్మడు ఇటీవల సినిమాలతో కంటే ఫోటోషూట్లతోనే అభిమానులకు ఎక్కువగా టచ్ లో ఉంటోంది. లేటెస్టుగా మాల్దీవుల విహారానికి సంబంధించిన ఫోటోషూట్ తో నెట్ ని గడగడలాడిస్తోంది.