బాలుకి ఫిజియోథెరపీ కూడా..!

0

ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రమణ్యం కరోనా కారణంగా చెన్నైలోని ఒక ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే. మొదట ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నా ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆయన్ను ఐసీయూలో ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లుగా ఆసుపత్రి వర్గాల వారు ప్రకటించారు. అప్పటి నుండి కూడా ఆయన ఆరోగ్యం విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒకానొక సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా ఆయన తనయుడు ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.

వారం రోజుల హై టెన్షన్ తర్వాత బాలు గారి ఆరోగ్యం కుదుట పడ్డట్లుగా ఆసుపత్రి వర్గాల వారు మరియు చరణ్ పేర్కొన్నారు. కొన్ని వారాల్లో నాన్న పూర్తిగా కోలుకుంటారని ఆయన మళ్లీ మీ ముందుకు వచ్చి పాటలు కూడా పాడుతారంటూ ఆయన పేర్కొన్నాడు. బాలు గారు ప్రస్తుతం ట్రీట్ మెంట్ కు స్పందించడంతో పాటు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. వైధ్యులను మరియు కుటుంబ సభ్యులను ఆయన గుర్తిస్తు ఉన్నారట.

ఒక వైపు కరోనా చికిత్స అందిస్తూ మరో వైపు ఫిజియోథెరపీ కూడా అందిస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. గత రెండు వారాలుగా ఆయన శరీర భాగాలు కదలకుండా ఉండటం వల్ల పట్టకు పోయి ఉంటాయి. వాటిని రిలాక్స్ చేసేందుకు ఫిజియో చేయిస్తు ఉంటారని వైధ్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా బాలు గారి ఆరోగ్యం కుదుట పడుతుందనే వార్తలు ఆయన అభిమానుల్లో ఆనందంను కలుగజేస్తున్నాయి.