కుదుటపడ్డ బాలు గారి ఆరోగ్యం

0

Sp Bala Subranyam Health Condition Now

Sp Bala Subranyam Health Condition Now

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమంగా ఉందంటూ వైధ్యులు చెప్పిన వెంటనే ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు. దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ కోరుకున్నారు. అందరి ప్రార్థనలు ఫలించి బాలు ఆరోగ్యం కాస్త కుదుట పడ్డట్లుగా ఆయన తనయుడు పేర్కొన్నాడు. నాన్న డాక్టర్ ను గుర్తు పట్టడంతో పాటు మాట్లాడుతున్నారంటూ చరణ్ పేర్కొన్నారు.

మరో వైపు బాలసుబ్రమణ్యం గారి భార్య కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుంటుందని వైధ్యులు పేర్కొన్నారట. రెండు మూడు రోజుల్లో అమ్మను డిశ్చార్జ్ చేస్తారని చరణ్ పేర్కొన్నాడు. చరణ్ ప్రకటనతో బాలు ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఐసీయూలో ఉంచి ట్రీట్ మెంట్ అందిస్తూ ఉన్నారంటూ ప్రకటన వచ్చిన నేపథ్యంలో అభిమానులు చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాలు గారు తాను బాగానే ఉన్నాను అంటూ ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చారు. తాజాగా చరణ్ ప్రకటనతో మరింత క్లారిటీ వచ్చి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.