Templates by BIGtheme NET
Home >> Cinema News >> OTTలో హిట్ అనడానికి ప్రామాణికం ఏమిటో

OTTలో హిట్ అనడానికి ప్రామాణికం ఏమిటో


What is the standard for hit in OTT

What is the standard for hit in OTT

కరోనా మహమ్మారీ సినీపరిశ్రమల రూపురేఖల్ని అమాంతం మార్చేస్తోంది. ఇన్నాళ్లు స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ నడిచేది. కానీ ఇప్పుడది కనిపించడం లేదు. మా హీరో రికార్డులు ఇవీ! అంటూ ఫ్యాన్స్ గొప్పలకు ముచ్చటించుకునే రోజులు పోయాయి. ఇక సోషల్ మీడియాల్లో అనవసర బాక్సాఫీస్ భజంత్రీలకు ఆస్కారం లేకుండా పోతోంది. ఇది ఊహించని పరిణామం. అయితే దీనికి కారణం ఏమిటి? అంటే డిజిటల్ – ఓటీటీ రిలీజ్ అనే అర్థమవుతోంది.

ఓటీటీల్లో ఇలాంటి బాక్సాఫీస్ వార్ కి ఆస్కారం లేనేలేదు. మరి హిట్టు ఫట్టు డిసైడయ్యేదెలా? అసలు ఓటీటీ లో హిట్ అనడానికి ప్రామాణికం ఏంటీ..! అంటే ఆన్సర్ లేదు. థియేటర్ లో హిట్ లేదా ఫట్ అనడానికి కలెక్షన్స్ తో పాటు థియేటర్ ఆకుపెన్సీ ఇలా చాలా ఉన్నాయి..! కానీ ఓటీటీకి అవేవీ వర్తించవు.

ఈ వేదికపై ఏ సినిమా రిలీజ్ చేయాలి అంటే ముందే ఆ సినిమాను ఓటీటీ వాళ్ళు లాభం ఇచ్చే కొనుకుంటున్నారు..! దీన్ని బట్టి చుస్తే ఓటీటీలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాను హిట్ అనే అనాలి. పైగా ఓటీటీల్లో అవి చాలా కాలం అందుబాటులో ఉంటాయి కాబట్టి.. సుదీర్ఘ కాలంలో వచ్చే వ్యూవర్ షిప్ కి ఆస్కారం ఉంటుంది. మా సినిమా హిట్టు..అని ఎవరైనా ప్రచారం చేసుకున్నా అదంతా ఉత్తుత్తేనని నమ్మాల్సి ఉంటుంది. అసలు హిట్టు ఫట్టుకి ప్రామాణికత లేనప్పుడు అదంతా ప్రచారం ఊదరగొట్టేందుకేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో రిలీజైన పలు తెలుగు చిత్రాలకు చిత్రయూనిట్లు సోషల్ మీడియాల్లో ఊదరగొట్టే పని పెట్టుకున్నాయి. కానీ అదంతా వృధా శ్రమేనని భావించాలి. మునుముందు పలువురు క్రేజీ స్టార్ల సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అప్పుడు హిట్టు బ్లాక్ బస్టర్ అంటూ ప్రచారార్భాటం ఎలా ఉంటుందో కాస్త వేచి చూడాలి.