సుశాంత్ డెత్ ఎఫెక్ట్ ‘దేవరకొండ ఫైటర్’ పై పడనుందా..??

0

Sushant death effect on  Devarakonda Fighter

Sushant death effect on Devarakonda FighterSushant death effect on Devarakonda Fighter

ప్రస్తుతం ఫైటర్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని అందరూ అనుకున్నారు కానీ తాజాగా టైటిల్ అది కాదని తేల్చేసారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇక టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ హీరో అంటే డిఫరెంట్ మాస్ లుక్ ఉండటం ప్రత్యేకం. ఇక పూరీ సినిమాలో నటించే హీరోలు ఆయనతో సినిమా చేసిన తర్వాత కమర్షియల్ గా ఒక రేంజ్ లో దూసుకుపోతారు. ఇదివరకే క్లాస్ గా కనిపించే రామ్ ని కూడా పూరి జగన్నాథ్ తనకు సరిపోయే ఊర మాస్ లుక్కులోకి మార్చుకున్నాడు.

మాస్ డైరెక్టర్ – మాస్ హీరో కలిస్తే అభిమానులలో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. పూరీ-విజయ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా పై అంచనాలు కూడా అదే రేంజ్ లో నెలకొన్నాయి. పూరీ కనెక్ట్స్ అండ్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్. ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీకి అనన్య టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకేసారి పరిచయం అవుతున్నారు. ముంబైలో షూటింగ్ మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇటీవలే హైదరాబాద్ లో సెట్ వేసి ఇక్కడే సినిమా ఫినిష్ చేసే ప్లాన్ ఉన్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యకు పాల్పడి చనిపోయిన విషయం తెలిసిందే.

ఆయన మరణం వెనుక పలువురు ప్రముఖులు కారణం అంటూ.. అందులో ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పేరు ప్రముఖంగా వినిపిచింది. అయితే సుశాంత్ మరణానికి కరణ్ కారణం అయ్యాడని ఆయన నిర్మించిన ‘సడక్-2’ సినిమా ట్రైలర్ విపరీతంగా నెగటివ్ టాక్ అలాగే యూట్యూబ్ లో డిస్ లైక్స్ సొంతం చేసుకుంది. అదేవిధంగా ఆయన నిర్మించిన గుంజన్ సక్సేనా సడక్-2 రెండు కూడా నెగటివిటీని పొందుతున్నాయి. మరి ప్రస్తుతం కరణ్ విజయ్ దేవరకొండ హీరోగా నిర్మిస్తున్న ఫైటర్ మూవీకి కూడా ఈ ఎఫెక్ట్ తప్పకుండా ప్రభావం చూపుతుందని సినీవర్గాలలో టాక్. “తను కోరింది ఒకటైతే జరిగింది ఒకటి” అన్నట్లుగా విజయ్ సినిమా పై సుశాంత్ డెత్ ఎఫెక్ట్ పడబోతుందని అంటున్నారు. ఎందుకంటే అక్కడ ప్రొడ్యూసర్ కరణ్. చూడాలి మరి పూరీ-విజయ్ లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో..!