బాలు చివరిగా నువ్వు నాతో ఏమన్నావో..!

0

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతితో సినీ లోకం శోకంలో మునిగి పోయింది. గత అయిదు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న గళం మూగబోవడంతో ఆయన పాటల అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఆయన పాటలు పాడుతూనే ఉన్నారు. పాటల కార్యక్రమంకు వచ్చిన సందర్బంగానే ఆయనకు కరోనా వచ్చింది. కనుక ఆయన మృతిని ఎవరు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన ఇంకా కూడా పాటలు పాడుతూ మరెన్నో పాటలు పాడే సామర్థ్యం ఉండగా అర్థాంతరంగా మృతి చెండంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో బాలు చివరగా డిస్కో రాజా సినిమాకు గాను నువ్వు నాతో ఏమన్నావో అనే పాటను పాడాడు.

సినిమా మొత్తంలో ఆ పాట సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా ఫ్లాప్ అయినా కూడా పాటలు హిట్ అయ్యాయి అంటే అది ఖచ్చితంగా బాలు పాడిన పాటే అయ్యి ఉంటుందని అభిమానులు అంటూ ఉంటారు. తెలుగులో ఆయనతో పాడించాలని ఎంతో మంది సంగీత దర్శకులు అనుకున్నారు. అయితే ఆయన మాత్రం చాలా అన్నింటికి కాకుండా తనకు నచ్చిన పాటలు మాత్రమే పాడుతూ వచ్చారు. అన్నింటిని ఆయన పాడితే ఆయన పాటల సంఖ్య 60 వేలు కూడా దాటేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని గత పదేళ్లుగా ఆయన పాటల ఎంపిక విషయంలో తనకు తాను చాలా నిబందనలు పెట్టుకున్నారు. కనుక ఈమద్య తగ్గాయి. తెలుగులో చివరగా ఆయన డిస్కో రాజాకు పాడగా తమిళంలో రజినీకాంత్ అన్నాత్తే మూవీకి బాలు పాడారు. తమిళంలో ఆయన చివరగా పాడిన పాట ఇంకా విడుదల కాలేదు.