కళాత్మక భంగిమతో మెంటలెక్కించిన మాళవిక

0

మాళవికా మోహనన్.. ఈ మల్లూ భామ స్పీడ్ గురించి చెప్పాలా? సమకాలీన నాయికల్లో జరంత స్పీడ్ గా ఉన్న టాప్ 5 బ్యూటీస్ లో ఈ అమ్మడి పేరు వినిపిస్తోంది. ఇతర యువ హీరోయిన్ల కంటే తమిళ ప్రేక్షకుల హృదయాల్ని వేగంగా దోచేసింది ఈ బ్యూటీ. కెరీర్ ఆరంభమే ఎంపిక చేసిన చిత్రాలు తనమెను స్టార్ లీగ్ లోకి తీసుకువచ్చేశాయి. మొదటి చిత్రం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన పేట. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించారు. `పేట`లో మిడిలేజీలో లవ్ లో పడే విలేజ్ యువతిగా నటించింది.

ప్రస్తుతం దళపతి విజయ్ మూవీ మాస్టర్ లో నటిస్తోంది. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ తో పాటు విజయ్ సేతుపతి .. ఆండ్రియా జెరెమియా తదితరులు ఇందులో నటించారు. అలాగే ధనుష్ హీరోగా కార్తీక్ నరేన్ దర్శకత్వం లో సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మించిన కొత్త చిత్రంలో మాలవికా `టాకేటివ్ స్టార్` గా కనిపిస్తుందని చెబుతున్నారు.

ఇక మాళవిక ఇటీవల వరుస ఫోటోషూట్లతో చెలరేగుతోంది. ఇంతకుముందు రవివర్మ గీసిన చిత్తరువులా మారిన ఫోటోషూట్ అంతర్జాలాన్ని షేక్ చేసింది. తాజాగా మరోసారి కళాత్మక భంగిమతో రక్తి కట్టించింది. ఒక టవల్ ధరించిన భంగిమ కుర్రకారు కంటికి కునుకు పట్టనివ్వడం లేదంటే నమ్మండి. అలాగే వేరొక ఫోటోషూట్ లోనూ డార్క్ షేడెడ్ లుక్ లో అంతే డార్క్ మేకప్ తో రకరకాల భంగిమలతో మాళవిక మెంటలెక్కించింది మరి.