ఎస్పీబీ కోలుకుంటున్నారు

0

గానగంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రమణ్యం ఆరోగ్యం క్షీణించిందని మీడియా చేస్తున్న హడావుడితో అభిమానులు .. సంగీత ప్రియులు తీవ్ర ఆందోళనకు గురైన సంగతి తెలిసిందే. ఎంజిఎం హెల్త్ కేర్ ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ నివేదిక ప్రకారం.. నిన్న రాత్రి నుండి ఎస్.పి.బిని ఐసీయులో ఉంచారు. దీంతో పరిస్థితి సీరియస్ గా ఉందని కొన్ని మీడియాలు ప్రచారం చేశాయి.

కానీ బాలు కుటుంబ సభ్యులు ఈ వార్తల్ని ఖండించారు. ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా తమిళ మీడియాతో మాట్లాడుతూ .. తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉందని.. కోలుకుంటున్నారని ధృవీకరించారు. ఎస్పీబీ సోదరి ఎస్పీ వసంత కూడా మీడియాకు ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. త్వరలోనే తన సోదరుడు సాధారణ స్థితికి వస్తాడని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రార్థించిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఎస్పీ బాల సుబ్రమణ్యం కోలుకుంటున్నారనడానికి సింబాలిక్ గా ఆసుపత్రి నుండి ఎస్పీబి ఛాయాచిత్రం ఒకటి విడుదల చేశారు. కరోనాకు చికిత్స విజయవంతంగా కొనసాగుతోంది. తాను బాగానే ఉన్నానని ఆయన థంబ్ ని చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాటల పూదోటలో వనమాలిగా బాలు ఆలపించిన వందలాది పాటలు ఎప్పటికీ అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాయి. సక్సెస్ ఫుల్ టీవీ హోస్ట్ గా ఆయన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే.