సోయగాలతో ‘ఆటాడుకుందాం రా’ అంటున్న సోనమ్ బజ్వా!!

0

2016లో సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘ఆటాడుకుందాం రా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయినుగా అడుగుపెట్టింది సోనమ్ బజ్వా. ఆ సినిమా హిట్ అవ్వలేదు కానీ అందులో హీరోయిన్ గురించి మాత్రం అప్పట్లో మంచి చర్చే జరిగింది. ఆ తర్వాత పాండవల్లో ఒకడు అనే తమిళ డబ్బింగ్ సినిమాతో పలకరించింది అమ్మడు. ఆ సినిమా కూడా ఆడలేదు. దాంతో సోనమ్ టాలెంట్ వృధా అయ్యిపోయిందే అని చాలామంది అనుకున్నారు. కానీ ఆమెకు తెలుగులో సరైన హిట్ పడితే ఎలా ఉండేదో అనే ఆలోచన అయితే అందరికి కలిగింది. సినీ ఇండస్ట్రీలో అందమైన భామలు ఎంతగా అందాలను ఆరబోస్తే అంతటి ఇమేజ్ వస్తుందని తెలిసిందే. ఇమేజ్ వచ్చిందంటే ఆ వెనకే అవకాశాలు కూడా వస్తాయి. అయితే ఆ ఆఫర్స్ రాకపోతే ఈ రోజుల్లో కుర్రభామలు ఎంతకైనా తెగించేస్తున్నారు. దాంతో హీరోయిన్ అవకాశాలకు బదులుగా వీళ్లకు ఐటం సాంగ్స్ ఆఫర్స్ వస్తున్నాయి.

ప్లాప్ హీరోయిన్లకు ఇండస్ట్రీలో అంతకుమించి ఏమీ ఒరగటం లేదు. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా.. కాస్త వయస్సులో ఉన్నప్పుడే అందాల ఆరబోతతో కైపెక్కించాలి.. మంచి ఇమేజ్ దక్కించుకొని.. నాలుగు రాళ్లు సంపాదించుకోవాలి అనే ఆలోచనతో ముందుకెళ్తుంది ఈ ఉత్తరాఖండ్ భామ సోనమ్ బజ్వా. అందుకే వెంకటేష్ హీరోగా రూపొందిన బాబు బంగారం సినిమాలోని ప్రత్యేక గీతంలో నర్తించింది అమ్మడు. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలో సోనమ్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది. ఇదివరకే బికినీలో దర్శనమిచ్చి షాక్ ఇచ్చిన భామ.. తాజాగా మరో గ్లామర్ ఫోటోతో ఇంస్టాగ్రామ్ లో దర్శనమిచ్చింది. అయితే ఫోటోలో అమ్మడు మినీ స్కర్టులో ధగధగ మెరిసిపోతుంది. ఈ సొగసరి సోయగాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఎక్కువగా పంజాబీ సినిమాలలో నటించిన సోనమ్.. ఆ తర్వాత తెలుగు హిందీ తమిళ ఇండస్ట్రీలలో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది.