Templates by BIGtheme NET
Home >> Cinema News >> తెలుగు చిత్ర పరిశ్రమకు అప్పుడు 4 స్తంభాలు ఇప్పుడు 6 స్తంభాలు…!

తెలుగు చిత్ర పరిశ్రమకు అప్పుడు 4 స్తంభాలు ఇప్పుడు 6 స్తంభాలు…!


తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటి తరం హీరోలలో నందమూరి తారకరామారావు – అక్కినేని నాగేశ్వర్ రావు – కృష్ణ – శోభన్ బాబు – కృష్ణంరాజు లు పిల్లర్స్ నిలిచారు. తెలుగు సినిమా గురించి చెప్పాల్సి వస్తే వీరి గురించి కచ్చితంగా చెప్పుకోవాలి అనే స్థాయికి తెలుగు సినిమాని తీసుకెళ్లారు. ఆ తర్వాత జనరేషన్ లో మెగాస్టార్ చిరంజీవి – కింగ్ నాగార్జున – విక్టరీ వెంకటేష్ – నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ కి నాలుగు స్తంభాలుగా నిలిచారు. అప్పటి తరం ప్రేక్షకులను అలరించిన ఈ నాలుగు స్టార్ హీరోలు ఇప్పటి తరానికి కూడా పోటీగా నిలుస్తున్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు నాలుగు పిల్లర్స్ గా నిలిచిన వీరు ఇప్పుడు షష్టిపూర్తి కూడా పూర్తి చేసుకొని సూపర్ సీనియర్ స్టార్స్ గా పిలవబడుతున్న. ఈ క్రమంలో ప్రెజెంట్ జెనరేషన్ లో వీరికి జూనియర్స్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టన హీరోలు తమ సత్తా చాటుతున్నారు.

కాగా నేటితరం హీరోలలో సూపర్ స్టార్ట్ మహేష్ బాబు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. నటశేఖరుడు కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు.. కెరీర్ స్టార్టింగ్ నుంచి హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హ్యాట్రిక్ విజయాలను అందుకున్న మహేష్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేశాడు. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్లాప్ సినిమాతో కూడా రికార్డ్ కలెక్షన్స్ సాధించే పవన్ స్టామినా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న పవన్ ‘వకీల్ సాబ్’ తో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ సైతం ప్రభాస్ తో సినిమాలు తీయడానికి క్యూలు కడుతున్నారంటే అతని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ‘ఆదిపురుష్’ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ తో కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తాత పేరుని నిలబెడుతున్నాడు. వరుస విజయాలతో దూకుడు మీదున్న తారక్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ అనే పాన్ ఇండియా సినిమాతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

చిరు తనయుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసాడు. ప్రస్తుతం భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ లో నటిస్తున్న చరణ్.. తండ్రితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో నటించనున్నాడు. ఇక మరో మెగా హీరో అల్లు అర్జున్ సైతం ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. ప్రస్తుతం ‘పుష్ప’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ట్ హీరోలుగా కొనసాగుతున్న ఈ ఆరుగురు హీరోలు సినిమాల్లో నటించడమే కాకుండా సినిమా నిర్మాణంలో కూడా భాగం పంచుకుంటూ తెలుగు సినిమా అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కొన్నేళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమల్లో ప్రధాన పోటీ ఈ స్టార్ హీరోల మధ్య ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ఒకప్పుడు టాలీవుడ్ కు నలుగురు హీరోలు పిల్లర్స్ గా నిలబడితే ఇప్పుడు ఆరుగురు ముఖ్య స్తంభాలుగా ఉన్నారని చెప్పవచ్చు.