ఇష్టం లేదంటూనే పవన్ కు హ్యాపీ బర్త్ డే

0

ప్రస్తుతం జనాల్లో శ్రీ రెడ్డికి మరియు కత్తి మహేష్ లకు ఈ స్థాయి గుర్తింపు ఉందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కారణం అనడంలో సందేహం లేదు. పూర్తిగా కాకున్నా కొంత మేరకు అయినా పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేయడం వల్లే వారు మీడియాలో ఫోకస్ అయ్యారు. ఇప్పుడు జనాల్లో సెల్రబెటీలుగా తిరుగుతున్నారు అనేది పవన్ ఫ్యాన్స్ మాట. ఆ విషయాన్ని పక్కన పెడితే వీరిద్దరు కూడా ఎప్పుడు పవన్ ను ట్రోల్ చేస్తూనే ఉంటారు. మొదట్లో పవన్ ఫ్యాన్స్ సీరియస్ గానే స్పందించేవారు. కాని ఇప్పుడు పట్టించుకోవడం లేదు.

రెగ్యులర్ గా పవన్ గురించి విమర్శలు చేస్తూనే ఉండే శ్రీ రెడ్డి నేడు ఆయన పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే సాదారణంగా శుభాకాంక్షలు చెబితే ఆమె శ్రీ రెడ్డి ఎలా అవుతుంది. విభిన్నంగానే ఆమె తన దైన శైలిలో పవన్ కు శుభాకాంక్షలు తెలిపింది. ఫేస్ బుక్ లో ఆమె తన పేజ్ లో.. నువ్వంటే నాకు ఇష్టం లేదు అయినా కూడా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టింది.

శ్రీ రెడ్డి పోస్ట్ కు పవన్ ఫ్యాన్స్ భారీగానే రియాక్ట్ అయ్యారు. ఎప్పుడు శ్రీ రెడ్డిని బూతులతో ట్రోల్ చేసే పవన్ ఫ్యాన్స్ ఈసారి ఆమెకు పాజిటివ్ గా కాస్త కృతజ్ఞత పూర్వకంగా స్పందించారు. పవన్ పై మీ దృష్టి భవిష్యత్తులో అయిన మారాలని ఆయన గురించి మీకు తెలియాలని కోరుకుంటున్నాం అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి పవన్ కు శ్రీ రెడ్డి బర్త్ డే విషెష్ వైరల్ అయ్యింది.