స్టార్ డైరెక్టర్ కి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువట..!

0

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరికి క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఎక్కువ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కెరీర్ ప్రారంభంలోనే వరుస విజయాలు అందుకున్న సదరు డైరెక్టర్.. స్టార్ హీరోలు సైతం అతనితో సినిమా కోసం వెయిట్ చేసే స్థాయికి వచ్చేసాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో క్లాస్ ఆడియన్స్ ను.. తనదైన శైలిలో కమర్షియల్ సినిమాలు తీస్తూ మాస్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయడానికి ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న ఆ స్టార్ డైరెక్టర్.. ఓ మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. స్టార్ హీరోలెవరూ ఖాళీగా లేకపోవడంతోనో లేదా స్టార్ హీరోలతో మాత్రమే సినిమా చేస్తాడనే మచ్చ చెరిపేసుకోవడం కోసమో తెలియదు కానీ.. యువ హీరోతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం హీరో పక్కన ఓ మలయాళ ముద్దుగుమ్మను రికమెండ్ చేస్తున్నాడని సమాచారం.

అయితే సక్సెస్ కి ఆమడ దూరంలో ఉండే ఈ హీరోయిన్ ని సిఫారసు చేయడానికి ప్రధాన కారణం ఆమె సామాజిక వర్గమే అని తెలుస్తోంది. ఇంతకుముందు తాను డైరెక్ట్ చేసిన ఓ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న సదరు డైరెక్టర్.. ఇప్పుడు మెయిన్ లీడ్ గా తీసుకోమని చెప్తున్నాడట. ఇందుకు ప్రధాన కారణం ఆ హీరోయిన్ ఈ దర్శకుడు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడమే అని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. నిజానికి ఆ స్టార్ డైరెక్టర్ సినిమాల్లో వారి క్యాస్ట్ కు చెందిన నటీనటులు సాంకేతిక నిపుణులకు ఇచ్చిన ప్రాధాన్యత వేరే వారికి పెద్దగా ఇవ్వడని ఎప్పటి నుంచో టాక్ ఉంది. దీనికి తోడు అతను మీడియాని మూవీ మాఫియాని ప్రకటనలని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడని ఓ హీరోయిన్ బహిరంగంగానే విమర్శించింది. ఇప్పుడు మరోసారి తన క్యాస్ట్ ఫీలింగ్ బయటపెడుతున్నాడని అంటున్నారు. అయినా టాలీవుడ్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందనే మాట ఎప్పటి నుంచో వింటున్నదే. మరి రాబోయే రోజుల్లో అయినా క్యాస్ట్ ని బట్టి కాకుండా టాలెంట్ ని బట్టి అవకాశాలు ఇస్తారేమో చూడాలి.