తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ పై మంచి క్రేజ్ ఉంది. అరవింద సమేత సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ కాంబో మళ్లీ ఎప్పుడు తమ రెండో సినిమా స్టార్ట్ చేస్తారా.. అని నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఒక డైలాగ్ రైటర్.. ఒక బ్రహ్మాండమైన డైలాగ్ డెలివరీ గల హీరో కలిస్తే ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందో త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ఫస్ట్ కాంబో మూవీలోనే చూపించేసారు. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ తో పాటు త్రివిక్రమ్ డైలాగ్స్ మంచి కిక్కిచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీ అయిపోయాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ఖరారు చేశారు.
ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల మీదనే దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో ఢీకొనే విలన్ క్యారెక్టర్ ఎవరినేది.. ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర విలన్ రోల్ చేసే అవకాశం ఉందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పొలిటిషన్ గా ఉపేంద్ర కనిపించనున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇదివరకే త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో మంచి రోల్ ప్లే చేసాడు ఉపేంద్ర. అయితే మరోసారి త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా కోసం సంప్రదించినట్లు ఇండస్ట్రీ టాక్. మరి ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా అంటే ఖచ్చితంగా ఉపేంద్ర నో చెప్పడని సినీ వర్గాలు అంటున్నాయి. దీని పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారట మేకర్స్. చూడాలి మరి ఎన్టీఆర్ తో ఉపేంద్ర పోరు అంటే మాములుగా ఉండదని ఫ్యాన్స్ టాక్.