Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఓటీటీలో విడుదల వద్దే వద్దంటున్న స్టార్ హీరో!

ఓటీటీలో విడుదల వద్దే వద్దంటున్న స్టార్ హీరో!


మనదేశంలో మార్చిలో కరోనా ప్రభావం మొదలైన వెంటనే ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. సినిమా షూటింగులతో పాటు థియేటర్లన్నీ మూతపడడంతో సినిమాల విడుదల కూడా అయిపోయింది. ఏప్రిల్ లో థియేటర్లలోకి రావాల్సిన సినిమాలన్నీ ఆగి పోయాయి. పరిస్థితులు సద్దుమణిగితే థియేటర్లలో విడుదల చేద్దామని చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయలేదు. అయితే ఎంతకూ కరోనా ప్రభావం తగ్గకపోవడం.. ఇప్పటికిప్పుడు సినిమా థియేటర్లు ప్రారంభమయ్యే అవకాశం లేక పోవడంతో పలువురు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయడం మొదలు పెట్టారు. చిన్న సినిమాలన్నీ ఓటీటీ లోకి క్యూ కట్టినా పెద్ద సినిమాలు మాత్రం ఆ బాట పట్టలేదు. ఇక ఎక్కువ రోజులు వెయిట్ చేస్తే నష్టాలు తప్పవంటూ దిల్ రాజు ‘వీ’ సినిమాను ఓటీటీ విడుదల చేశాడు. కానీ ఎనర్జిటిక్ హీరో రామ్ మాత్రం తను నటించిన ‘రెడ్ ‘ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించాడు. ఈ సినిమా ఏప్రిల్ సెకండ్ వీక్ లోనే విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో ఆగిపోయింది.

షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ ఓటీటీలో వరుసగా విడుదల అవుతున్నా పరిస్థితులు చక్కబడే దాకా ఆగి సినిమా థియేటర్ లోనే విడుదల చేద్దామని రామ్ భావిస్తున్నాడు. రెడ్ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా స్రవంతి రవి కిషోర్ సినిమా ను నిర్మించాడు. సూపర్ హిట్ సాధించిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత విడుదలవుతున్న సినిమా కావడం తో ‘రెడ్’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రవితేజ నటించిన క్రాక్ వైష్ణవ్ తేజ్ డెబ్యూ ఫిల్మ్ ‘ఉప్పెన’ కూడా చాలా నెలలుగా విడుదలకు నోచుకోలేదు. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారా.. అని ఆ సినిమాల మేకర్స్ ఎదురు చూస్తున్నారు.