సుశాంత్ పై విష ప్రయోగం జరిగిందంటున్న ఎంపీ

0

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు పలు రకాలుగా ఈ మృతి గురించి చర్చించుకుంటున్నారు. కొందరు ఆత్మహత్య అనుకుంటూ ఉంటే కొందరు కుక్క బెల్ట్ తో ఆయను మెడకు ఉరి వేసి చంపి ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నా కూడా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం మొదటి నుండి కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా ఆయన సుశాంత్ చనిపోవడానికి ముందు విష ప్రయోగం జరిగి ఉంటుందనే అనుమానం ను వ్యక్తం చేస్తున్నాడు. సుశాంత్ చనిపోయిన కొన్ని గంటల తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించారు. అప్పటికి అతడి శరీరంలో ఉన్న విషం జీవ రంద్రాల ద్వారా కరిగి పోయిందని ఎంపీ చెబుతున్నాడు. ఈ విషయంలో సుశాంత్ ఇంటి పని వారితో పాటు ఆయనకు సన్నిహితంగా ఉన్న అందరిని కూడా ప్రశ్నించాల్సిందే అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు.

సుశాంత్ కేసు ఇప్పటికే సీబీఐ వారికి అప్పగించారు. దాంతో వారు అన్ని విషయాలపై ఎంక్వౌరీ చేస్తారనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది. ఇలాంటి సమయంలో సుబ్రమణ్య స్వామి చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. నిజంగానే సుశాంత్ పై విష ప్రయోగం జరిగి ఉంటే అది ఎవరు చేసి ఉంటారు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు ముందు ముందు మరెన్ని మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది.