సుమతో గొడవ నిజమే కాని..

0

తెలుగు వారందరికి స్టార్ హీరోలు హీరోయిన్స్ అంతా ఎంత వరకు తెలుసో తెలియదో కాని సుమ మాత్రం తెలుగు వారిలో టీవీతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత రెండు దశాబ్దాలుగా ఆమె టెలివిజన్ ప్రస్థానం అలా దూసుకు పోతుంది. అద్బుతమైన టీవీ జర్నీ ఆమెకు మాత్రమే సాధ్యం అయ్యింది. ఏ టీవీ పెట్టినా కూడా అందులో ఏదో ఒకలా కనిపిస్తూనే ఉంటుంది. ఇక సుమ ఫ్యామిలీ విషయాలు కూడా ఈమద్య చాలా చర్చనీయాంశం అయ్యాయి. కొందరు అయితే ఏకంగా భర్త రాజీవ్ నుండి సుమ విడిపోయి విడి విడిగా ఉంటున్నారు.. విడాకులు తీసుకున్నారు అంటూ పిచ్చి పుకార్లు ప్రచారం చేశారు. కాని ఇటీవల కొడుకు ను హీరోగా పరిచయం చేయబోతున్నట్లుగా ప్రకటించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఇద్దరు కలిసే ఉంటున్నారు అనే విషయంపై అందరు నమ్మకానికి వచ్చారు.

తాజాగా ఆ విషయమై రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చాడు. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న కలహాలు గొడవలు కామన్ గా ఉంటాయి. అన్ని ఇళ్లలో మాదిరిగానే మా ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు జరిగాయి. అంతే తప్ప విడాకుల వరకు వెళ్లలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. భార్య భర్తల మద్య గొడవలు కామన్ కాని అది సుమ రాజీవ్ ల గొడవ అవ్వడం వల్ల చాలా పెద్దగా జనాలకు కనిపించింది. దాంతో కొందరు విడాకులు తీసుకున్నారు అంటూ రాసేశారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నామని అన్నాడు. ప్రస్తుతం తమ కొడుకును హీరోగా నిలబెట్టేందుకు మేము ప్రయత్నం చేస్తున్నట్లుగా రాజీవ్ అన్నాడు.