Templates by BIGtheme NET
Home >> Cinema News >> సందీప్ కిషన్ భైరవ కోన.. గెట్ రెడీ!

సందీప్ కిషన్ భైరవ కోన.. గెట్ రెడీ!


సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఊరుపేరు భైరవకోన మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఖరారు అయ్యింది. సందీప్ కిషన్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

రాజేష్ దండా ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుందంట. తాజాగా రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 9న ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అవుట్ ఫుట్ సిద్ధం కావడంతో ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలు పెట్టబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

మైఖేల్ మూవీ తర్వాత సందీప్ కిషన్ నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. తెలుగు, తమిళ్ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ తో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై సందీప్ కిషన్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.

విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ ఇప్పటికే టైగర్ అనే మూవీ చేశారు. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరో సారి విఐ ఆనంద్ సందీప్ కిషన్ ని డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ మూవీ అతనికి ఎలాంటి సక్సెస్ ని అందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సామజవరగమన లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజేష్ దండా నుంచి ఈ మూవీ వస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో ఈ చిత్రాన్ని విఐ ఆనంద్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు. ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. విఐ ఆనంద్ డిస్కో రాజా సినిమా తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకొని ఊరు పేరు భైరవకోన సినిమా చేస్తూ ఉండటం విశేషం.