Templates by BIGtheme NET
Home >> Cinema News >> బీచ్‌కి ఎగిరొచ్చిన ప‌క్షి దేవ‌త‌

బీచ్‌కి ఎగిరొచ్చిన ప‌క్షి దేవ‌త‌


అవును..! ప‌క్షి దేవ‌త బీచ్‌లోకి ఎగిరొచ్చింది. తెల్ల‌ని రెక్క‌లు ట‌ప‌ట‌పా గాలికి విదిలిస్తూ, ఎగురుతున్న భంగిమ‌లో క‌నిపించింది. అల‌లు పాల‌నురుగును తోసుకుంటూ వ‌చ్చి స‌ద‌రు ప‌క్షి దేవ‌త‌కు నేప‌థ్యంగా మారాయి. ఈ అంద‌మైన రూపాన్ని చూడ‌గానే కాళిదాసులైనా క‌వులుగా మార‌తారు. అంతందంగా క‌నిపిస్తున్న ఈ ప‌క్షి దేవ‌త ఎవ‌రు? అంటే.. పేరు- ప్రియా ప్ర‌కాష్ వారియర్.

దక్షిణాది వింక్ గర్ల్‌గా పాపుల‌రైన ప్రియా ప్రకాష్ వారియర్ తనదైన‌ అందం చురుకుద‌నంతో గ‌డిచిన కొన్నేళ్లుగా కుర్ర‌కారును క‌వ్విస్తూనే ఉంది. ప్రియా ఇప్ప‌టికే తెలుగు ఆడియెన్ కి సుప‌రిచితం. మ‌ల‌యాళ చిత్రం ఒరు ఆధార్ ల‌వ్ త‌ర్వాత‌ నితిన్- సాయిధ‌ర‌మ్ తేజ్ లాంటి యువ‌హీరోల స‌ర‌స‌న న‌టించేసిన ఈ బ్యూటీ అటు మ‌ల‌యాళం, హిందీలోను వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో ప్రియా ప్ర‌కాష్ నిరంత‌ర ఫోటోషూట్లు వైర‌ల్ గా మారుతున్నాయి. తాజా ఫోటోషూట్‌లో ప్రియా ప‌క్షి దేవ‌త‌ను త‌ల‌పిస్తోంది. ముఖ్యంగా బీచ్ ప‌రిస‌రాల్లో ఫెద‌ర్ వింగ్స్ తో క్రియేటివ్ ఫోట‌గ్ర‌ఫీ ఇంప్రెస్ చేస్తోంది.

స‌ముద్ర ప‌రిస‌రాల్లో బీచ్ వైబ్స్ ని ఈ ఫోటోషూట్ మ‌రింత‌గా పెంచింది. ఈ లుక్‌ని నిశితంగా ప‌రిశీలిస్తే ప్రియా ప్ర‌కాష్ పొడుగు కాళ్ల‌ను మ‌రింత పైకి ఎత్తుతూ మ‌డ‌మ లెంగ్త్ ను చూపిస్తోంది. ప్రియా అమాయ‌క‌మైన మోమును, నాభి సొగ‌సును ఈ ఫోటోషూట్ ఎంతో అందంగా ఆవిష్క‌రించింది.

ప్ర‌స్తుత కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. 3 మంకీస్- ల‌వ్ హ్యాక‌ర్స్ లాంటి ప్రేమ‌క‌థా చిత్రాల్లో న‌టిస్తున్న ప్రియా ప్ర‌కాష్ క‌న్న‌డ చిత్రం `విష్ణు ప్రియ`లో నాయికా ప్రధాన పాత్ర‌లో న‌టిస్తోంది. చాలా కాలం క్రితం ప్రారంభ‌మై వివాదాల‌తో ఆగిపోయిన `శ్రీ‌దేవి బంగ్లా` రిలీజ్ కోసం వేచి చూస్తోంది.