సిక్స్ ప్యాక్ చూపించి మరీ రెడీ అంటున్న సందీప్ కిషన్

0

యంగ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా సినిమా షూటింగ్ నిలిచి పోయింది. మళ్లీ మెల్లగా షూటింగ్ లు షురూ అవుతున్న ఈ సమయంలో తన సినిమాను కూడా పునః ప్రారంభించబోతున్నట్లుగా సందీప్ కిషన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అయితే సాదారణంగా ఆ విషయాన్ని తెలియజేయకుండా అభిమానులకు కన్నుల పండుగ చేశాడు. రెండు ఫొటోలను షేర్ చేసి నెటిజన్స్ ను ఫిదా చేశాడు.

ఒక ఫొటోలో సిక్స్ ప్యాక్ బాడీని చూపించడంతో పాటు మరో ఫొటోలో కూల్ స్టైలిష్ లుక్ తో కనిపించాడు. మొత్తానికి రెండు ఫొటోలు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఏ1 ఎక్స్ ప్రెస్ లో సందీప్ ను కొత్తగా విభిన్నంగా చూడబోతున్నాం అంటూ ఈ ఫొటోలు చూస్తుంటే అనిపిస్తుంది. ఇక రేపటి నుండి షూటింగ్ కు వెళ్లబోతున్న ఈ సినిమాకు డెన్నిస్ జీవన్ కనుకోలను దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్న విషయం తెల్సిందే. ఆమె కూడా రేపటి షూటింగ్ కోసం హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది. పీపీఈ కిట్ ధరించి మరీ విమాన ప్రయాణం చేసి వచ్చిన లావణ్య రేపటి నుండి షూటింగ్ లో జాయిన్ కాబోతుంది. ఈ సినిమాకు సందీప్ కిషన్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. హాకీ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అవ్వడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.