వన్ మిలియన్ ఫాలోవర్స్ క్లబ్ లో యూత్ స్టార్ నితిన్

0

యూత్ స్టార్ నితిన్ ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ లో బ్యాచిలర్ షిప్ ని త్యాగం చేసి.. తాను ప్రేమించిన షాలినిని వివాహమాడేశారు. అతను గత కొన్ని వారాలుగా భార్య షాలినితో ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాధిస్తున్నాడు. ఇక నితిన్ – షాలిని జంట వివాహానికి సంబంధించి ఫోటోలు అంతర్జాలంలో జోరుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. నితిన్ ఈ ఫోటోల్ని ఇన్ స్టా ద్వారా షేర్ చేయడంతో అభిమానులు వాటిని వైరల్ చేశారు.

తాజాగా యూత్ స్టార్ ఇన్ స్టాలో వన్ మిలియన్ క్లబ్ లో చేరారు. ఈ సందర్భంగా నితిన్ అభిమానులు `1మిన్ స్టా లవ్ ఫర్ నితిన్` అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. 10లక్షల మంది ఫాలోవర్స్ అంటే చిన్న విషయమేమీ కాదు. మహేష్.. ప్రభాస్ .. చరణ్.. లాంటి స్టార్లు సోషల్ మీడియాల్లో జోరుగా ఉన్నారు. ఇప్పుడు అదే జాబితాలో నితిన్ కూడా దూసుకుపోతున్నాడు.

అదంతా సరే కానీ.. నితిన్ తదుపరి ప్లానింగ్ ఏమిటి? అంటే.. బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాల్లో నటించాల్సి ఉంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేం మేర్లపాకా గాంధీ.. చంద్రశేఖర్ యెలేటి.. కృష్ణ చైతన్యలతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. నితిన్ తదుపరి చిత్రం కోసం కసరత్తులు చేస్తున్నాడు. అలాగే జంప్ థ్రెడ్ చేస్తున్న వీడియో ఇదివరకూ వైరల్ అయ్యింది.