Templates by BIGtheme NET
Home >> Cinema News >> సన్నీలియోన్ కి రావాల్సిన ఛాన్స్ కొట్టేసిన కాజల్

సన్నీలియోన్ కి రావాల్సిన ఛాన్స్ కొట్టేసిన కాజల్


దశాబ్ధం పైగా కెరీర్ లో ఏనాడూ హద్దు మీరి అందాల్ని ఎక్స్ పోజ్ చేయలేదు కాజల్. చందమామను తలపించేలా ఎంతో పద్ధతిగానే కనిపించింది. టూమచ్ బోల్డ్ క్యారెక్టర్లను అంగీకరించకుండా … ఏమేరకు అందాల ప్రదర్శన అవసరమో ఆ హద్దుల్ని మెయింటెయిన్ చేసింది. అందుకే ఇప్పటికీ కాజల్ అంటే క్రేజు చెక్కు చెదరలేదు. తనకు తానుగానే కాదనుకోవాలి తప్ప తనకు ఆఫర్ ఇవ్వను అన్నవాళ్లే లేరు.

ప్రస్తుతం అందాల చందమామ `భారతీయుడు 2`లో కమల్ హాసన్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి తప్పుకుందని ప్రచారమైనా ఆ తర్వాత కాజల్ ఆ వార్తల్ని ఖండించింది. ఫ్రెండు రకుల్ తో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంటోంది. ఇక ఈ మూవీలో కాజల్ అందాల్ని కాస్త ఘాటుగానే చూపించేందుకు శంకర్ ప్లాన్ చేశారట. శంకర్ శైలిలోని పాటల్లో కాస్త గ్లామర్ డోస్ ఎక్కువే కనిపించే వీలుందని కథనాలొచ్చాయి.

అదంతా సరే కానీ.. మహమ్మారీ క్రైసిస్ లో ఈ మూవీ షూటింగుకి సంబంధించి సరైన అప్ డేట్ ఏదీ లేదు. ఈలోగానే స్వీయనిర్భంధంలో కథలు వింటున్న కాజల్ తాజాగా ఓ సినిమాకి సంతకం చేసిందట. ఈసారి ఆఫర్ టూమచ్ బోల్డ్ క్యారెక్టర్ అని తెలిసింది. సన్నీ కి రావాల్సిన ఛాన్స్ కొట్టేసిన కాజల్..! అంటూ ప్రచారం హీటెక్కిస్తోంది. తాజాగా ఓ తమిళ్ అడల్ట్ కామెడి లో నటించడానికి కాజల్ ఒప్పుకుంది. అయితే ఇందులో సన్నీలియోన్ ది కీలక పాత్రట. ఐతే ఈ కథ విన్న కాజల్.. మెయిన్ లీడ్ రోల్ కాకుండా సన్నీ రోల్ చేస్తాను అని చెప్పడం తో మేకర్స్ ఇప్పుడు కాజల్ కే ఆ పాత్ర ఇచ్చినట్లు తెలిసింది. కెరీర్ ఎండింగ్ లో ఆడియెన్ కి హాట్ హాట్ గా విందు ఇవ్వడానికి కాజల్ బాగానే రెడీ అవుతోందన్నమాట.