షష్ఠిపూర్తి భామ్మ టీనేజీ వేషాలు షాకిస్తున్నాయిగా!

0

పర్ఫెక్ట్ ఫిట్ బాడీని మెయింటెయిన్ చేయాలంటే ఎంత వయసుండాలి? బికినీ వేయాలంటే ఏ ఏజ్ సూటబుల్? ఇలాంటి ప్రశ్నలకు ఠకీమని జవాబిచ్చేయడం కుదరదు. కానీ ఒక్కోసారి కొందరిని చూస్తే మాత్రం మరో మాట లేకుండా .. వయసుదేముంది మనసుండాలే కానీ…! అనేస్తాం.

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ లేటు వయసు భామామణి వేస్తున్న బికినీ వేషాలు చూస్తుంటే చెమటలు పట్టకుండా ఎవరైనా ఉంటారా? వృద్ధాప్యం దరి చేరనివ్వని అమృతం కుండను తాగిందా ఏమిటో కానీ.. టాప్ మోడల్ కం కుకరీ యాంకర్ పద్మాలక్ష్మికి అసలు వయసు అన్నదే సమస్య కాలేదు.

అమెరికాలో ఎన్నారైగా స్థిరపడిన భారతీయ సూపర్ మోడల్ పద్మా లక్ష్మి ఏజ్ 50 కి చేరువైనా.. ఇప్పటికీ టీనేజీ గాళ్ లా తళుకుబెళుకులు ప్రదర్శించడం ఇటీవల బర్త్ డే ఫోటోలు చూసిన వారిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పద్మాజీ బికినీ బీచ్ ని షేక్ చేస్తూ ఆటలాడుకుంటోంది. ఎప్పుడో 1990-2000 సంవత్సరంలో మోడల్ గా కనిపించింది. ఇప్పటికీ అవే అందాల నవనవలతో కుర్రకారు గుండెల్ని పిండేస్తున్నారు మ్యాడమ్. రచయితగా .. చెఫ్ గా .. అమెరికన్ ఛానెల్ కుకరీ స్పెషలిస్టుగా పద్మాలక్ష్మి సుపరిచితం. మలైకా.. శిల్పాశెట్టి.. మాధురి ధీక్షిత్ .. వీళ్లకు ధీటుగా పర్ఫెక్ట్ ఫిట్ బాడీని మెయింటెయిన్ చేయడం మ్యాడమ్ కే చెల్లింది సుమీ!