సూపర్ స్టార్ మూవీ దర్శకుడి మార్పు

0

తమిళ సూపర్ స్టార్ విజయ్ త్వరలో మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలోనే మాస్టర్ విడుదల అవ్వాల్సి ఉంది. ఆ వెంటనే మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ తదుపరి సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉంది. విజయ్.. మురుగదాస్ ల కాంబో మూవీ అధికారికంగా కూడా ప్రకటన వచ్చింది.

కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అయ్యింది. మళ్లీ పరిస్థితులు కుదుట పడుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి. కాని విజయ్ మూవీ మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. ఈ సమయంలోనే విజయ్ సినిమా నుండి దర్శకుడు మురుగదాస్ తప్పుకున్నాడు అనే ప్రచారం జరుగుతోంది.

సన్ పిక్చర్స్ వారు మురుగదాస్ కాకుండా విజయ్ సినిమాకు దర్శకుడు మాగిజ్ తిరుమేని ను ఎంపిక చేశారట. ఈయన గతంలో విజయ్ తో సినిమాను తెరకెక్కించాడు. వీరిద్దరి కాంబోకు మంచి క్రేజ్ ఉంది. కాని మురుగదాస్ ను ఎందుకు విజయ్ సినిమా నుండి తప్పించారు అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఇప్పటికే వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా ఎదురు చూస్తున్న సమయంలో విజయ్ 65వ సినిమాకు మురుగదాస్ కాకుండా మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించబోతున్నట్లుగా ప్రచారం జరగడంతో అభిమానులు మరియు ప్రేక్షకులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.