‘ఫ్యాన్స్ ఆరోగ్యం ముఖ్యం’ అంటూ రిక్వెస్ట్ చేసిన సూపర్ స్టార్..!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఆగస్టు 9న పుట్టినరోజు జరుపుకోనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నలభై నాలుగు దాటి 45వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. మహేష్ పుట్టినరోజు అంటే మహేష్ బాబుకి మాత్రమే స్పెషల్ కాదు. మహేష్ అభిమానులకు కూడా స్పెషలే. ఇక తమ ఫేవరెట్ హీరో పుట్టినరోజు సందర్భంగా నెలరోజుల ముందు నుండే ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ సందడి మొదలెట్టేశారు. ఈ నేపథ్యంలో మహేష్ తన అభిమానులను ఉద్దేశించి ఓ విజ్ఞప్తి చేశాడు. “ప్రియమైన అభిమానులారా.. మీరందరూ నాకు తోడుగా ఉండడం నా అదృష్టం. నా పుట్టినరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండాలని మీరు చేస్తున్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను.

ప్రస్తుతం కరోనాతో మనమందరం చేస్తున్న ఈ యుద్ధంలో సురక్షితంగా ఉండడం అనేది అన్నిటికంటే ముఖ్యం. నా పుట్టిన రోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ మహేష్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసాడు. ఇక తన ఫ్యాన్స్ కోసం మహేష్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా మహేష్ పుట్టినరోజుకు ఎన్నో సర్ప్రైజులు ఉన్నాయని ఇదివరకే ఫ్యాన్స్ తెలిపారు. మరి అవేంటో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు మహేష్. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. స్క్రిప్టు వర్క్ పూర్తయిన ఈ సినిమా త్వరలో పట్టలెక్కనుందట.