ఆ క్రేజీ రీమేక్ చేయబోతున్నది బ్రదర్స్ కాదట

0

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుం’ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా నెలల క్రితం ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే మల్టీ స్టారర్ స్ర్కిప్ట్ అవ్వడంతో ఈ సినిమాలో నటించేందుకు హీరోలు ముందుకు రావడం లేదు అనే టాక్ వినిపిస్తుంది. త్వరలోనే తెలుగులో ఈ రీమేక్ ను సెట్ చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలో రీమేక్ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని మేకర్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విధంగా తమిళంలో కూడా రీమేక్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి.

తెలుగులో మాదిరిగా కూడా అక్కడ కూడా ఒక పట్టాన హీరోలు సెట్ అవ్వడం లేదు. మొన్నటి వరకు ధనుష్ నటించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత తమిళ స్టార్ బ్రదర్స్ సూర్య మరియు కార్తిలు ఈ రీమేక్ లో నటించేందుకు సిద్దం అయ్యారంటూ మీడియాలో వచ్చాయి. ఇటీవల సూర్య సన్నిహితుల నుండి ఆ విషయమై క్లారిటీ వచ్చింది. ఆ రీమేక్ లో సూర్య నటించడం లేదన్నారు. అయితే కార్తీ విషయం మాత్రం నిజమే అన్నట్లగా పేర్కొన్నారు. కార్తి మరియు మరో పాత్రలో తమిళ సీనియర్ నటుడు పార్తీబన్ ను నటింపజేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు. ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు.